ఇక సినిమాలకు గుడ్ బై... అదే నా చివరి సినిమా: ఉదయనిధి స్టాలిన్

కోలీవుడ్ స్టార్ హీరోగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ఉదయనిధి స్టాలిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మరోవైపు సినిమాలలో నటిస్తున్నారు.

 Udhayanidhi Stalin Announces Maamannan Will Be His Last Film, Udhayanidhi Stalin-TeluguStop.com

ఈయన తెలుగులో డబ్ అయిన ‘ఓకే ఓకే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.ఇటీవల ఉదయనిధి స్టాలిన్‌ నటించిన తమిళ చిత్రం ‘నెంజుకు నీధి’.

 ఈ సినిమా మే 20వ తేదీ విడుదల కానుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమాతో పాటు ఉదయనిధి మారి సెల్వరాజ్ డైరెక్షన్‌లో ‘మామన్నన్‌’ అనే మూవీ చేస్తున్నాడు.ఈ సినిమాలో ఉదయనిధి స్టాలిన్ తో పాటు కీర్తి సురేష్‌, ఫహాద్‌ ఫాజిల్‌, వడివేలు వంటి స్టార్‌ యాక్టర్స్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉదయనిధి తాను నటించబోయే ‘మామన్నన్‌’సినిమానే తన చివరి సినిమా అంటూ షాకింగ్ న్యూస్ చెప్పారు.ఈ సినిమా తరువాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అవుతానని ఉదయనిది పేర్కొన్నారు.

Telugu Kollywood, Maamannan, Selvaraj, Tamilnadu Cm-Movie

ప్రస్తుతం ఈయన ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ కొనసాగలేక ఈయన సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఉదయనిది స్టాలిన్ తండ్రి తమిళనాడు సీఎం కావడంతో ఈయన కూడా తన తండ్రి బాటలోనే ఇకపై రాజకీయాలలో కొనసాగడం కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా ఇకపై ఈయన సినిమాలలో కనిపించరని తెలియడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube