జుట్టు పొడిబారడం.చాలా మందిని వేధించే సమస్య ఇది.
వాతావరణంలో వచ్చే మార్పులు, ఆహారపు అలవాట్లు, రెగ్యులర్‌గా హెయిర్ వాష్ చేసుకోవడం, కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపూలను వాడటం వంటి రకరకాల కారణాల వల్ల జుట్టు పొడిబారిపోయి నిర్జీవంగా మారుతుంది.దాంతో ఈ సమస్య నుంచి బయట పడటం కోసం ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు.
ఖరీదైన ఆయిల్స్, సీరమ్స్ యూస్ చేస్తుంటారు.కానీ, పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే పొడిబారిన జుట్టును స్మూత్ అండ్ షైనీగా మార్చుకోవచ్చు.
మరి ఇంకెందుకు లేటు అసలు మ్యాటర్‌లోకి వెళ్లిపోదాం పదండీ.
ముందుగా ఒక బంగాళదుంపను తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడగాలి.
ఇలా కడిగిన బంగాళదుంపను సన్నగా తురుముకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో బంగాళదుంప తురుము వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుని చల్లారబెట్టుకోవాలి.

పూర్తిగా చల్లారిన తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో ఉడికించిన బంగాళదుంప తురుము వాటర్‌తో సహా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ పెరుగు, వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ కొకనట్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు మీ రెగ్యులర్ ఆయిల్‌ను లైట్‌గా హీట్ చేసి తలకు పట్టించి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి.
ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే పొడిబారిన జుట్టు స్మూత్‌గా, సిల్కీగా మరియు షైనీగా మారుతుంది.