సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పని చేసే హీరోలు వారికి ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు వచ్చి అంచెలంచెలుగా ఎదగాలని భావిస్తారు.ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్న హీరోలు అనంతరం బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం కోసం ఎంతో కష్ట పడుతూ బాలీవుడ్ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
అయితే బాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్న బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు కన్నెత్తి కూడా చూడని హీరోలలో మహేష్ బాబు ఒకరు.ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా కొనసాగడం కాకుండా నిర్మాతగా ఎన్నో సినిమాలను నిర్మించి మంచి గుర్తింపు పొందారు.
ఈ క్రమంలోనే మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న మేజర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ఆయన చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు.
ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం లో భాగంగా బాలీవుడ్ ఎంట్రీ గురించి మహేష్ బాబు ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం చెబుతూ తనకు బాలీవుడ్ ఇండస్ట్రీ ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదని, ఇండస్ట్రీలోకి తాను వెళ్తే అక్కడి వాళ్ళు నన్ను భరించడం కష్టం అంటూ ఈయన షాకింగ్ కామెంట్ చేశారు.

నాకంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో గౌరవం, విలువ ఉన్నాయి.నాకు ఇలాంటి గుర్తింపు తీసుకువచ్చింది.టాలీవుడ్ చిత్ర పరిశ్రమ కన్నా తనకి టాలీ వుడ్ చిత్రపరిశ్రమలోనే నటుడిగా కొనసాగుతూ మరిన్ని అద్భుతమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తానని మహేష్ బాబు వెల్లడించారు.నాకు పేరు తీసుకువచ్చిన టాలీవుడ్ ఇండస్ట్రీలో మరికొన్ని సినిమాలు చేసి మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను.
ప్రస్తుతం నా కోరిక నెరవేరుతుంది అంటూ మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.