ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 2022 మంది మాతృమూర్తులకు తమ పిల్లలు పాలతో పాలభిషేకం నిర్వహించి పాద పూజ నిర్వహించారు.పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో మథర్స్ డే ను పురస్కరించుకుని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి .
చందర్ ఆద్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాతృ మూర్తులతో పాటు వారి పిల్లలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ,అమ్మ లేనిదే జననం లేదని,అమ్మ అంటే కొండంత అండ అని అన్నారు.పిల్లలకు తల్లిదండ్రులు అంటే గౌరవంతో పాటు భవిష్యత్తు తరాల వారికి ఇలాంటి కార్యక్రమాలు గుర్తుండాలని,తపనతో ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఈ పాద పూజ కార్యక్రమాన్ని చేస్తున్నట్లు చెప్పారు.2018 నుండి మాతృ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.కాగ ఈ మహా పాద పూజ మహోత్సవం గోల్డెన్ స్టార్ వండర్ రికార్డు లో చోటు చేసుకుంది.