ప్రస్తుత సమ్మర్ సీజన్‌లో మేకప్ వేసుకుని బయటకు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఎండలు, అధిక వేడి కారణంగా క్షణాల్లోనే మేకప్ మొత్తం చెదిరిపోయి ముఖం అందవిహీనంగా మారుతుంది.
అందుకే సమ్మర్‌లో మేకర్ వేసుకోవడానికే భయడపతారు.అలా అని మేకప్ వేసుకోకుండా బయటకు వెళ్లలేకపోతుంటాయి.
అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను పాటిస్తే గనుక మేకప్ లేకున్నా అందంగా మెరిసిపోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండీ.
ముందుగా కొన్ని తులసి ఆకులు మరియు వేపాకులు తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి తడిలేకుండా ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత ఎండలో ఎండబెట్టుకుని విడి విడిగా పొడి చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ వేపాకుల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ తులసి ఆకుల పొడి, వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి, వన్ టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు మరియు రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై వాటర్‌తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకుని ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకోవాలి.ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే ముఖం సహజంగానే ప్రకాశవంతంగా, అందంగా మెరుస్తుంది.

అలాగే మరో చిట్కా ఏంటంటే.ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ తులసి ఆకుల పొడి, వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి, రెండు టేబుల్ స్పూన్ల బంగాళదుంప జ్యూస్, నాలుగైదు టేబుల్ స్పూన్ల పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.ఇరవై నిమిషాల అనంతరం క్లీన్ చేసుకోవాలి.ఇలా తరచూ చేసినా కాంతివంతమైన, మెరిసే చర్మాన్నితమ సొంతం చేసుకోవచ్చు.