జాతీయ స్థాయిలో సినిమాలు తీసే దర్శకుడు దాదాపు కనిపించేవారు.కాదు ఒకవేళ కనిపించిన ఒకరో ఇద్దరో అక్కడక్కడ కనిపించే వారు.
వారు తీసిన సినిమాలే భారత దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించేవి.కానీ ఇటీవల కాలంలో మాత్రం సౌత్ నుంచి ఎంతోమంది దర్శకులు అద్భుతంగా సత్తా చాటుతూ ఉండటం గమనార్హం.
ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ ఏకంగా సంచలన రికార్డులు సృష్టిస్తూ ఉన్నారు.ఇక బాహుబలి సినిమా తర్వాత సౌత్ ఇండియా సినిమా రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
ఇక బాహుబలి 2, త్రిబుల్ ఆర్ సినిమాలతో రాజమౌళి ప్రస్తుతం దేశంలోనే నెంబర్‌వన్ దర్శకుడిగా వెలుగొందుతుఉన్నాడు అన్నది కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
ఇక డైరెక్టర్ శంకర్ ఎన్నో రోజుల నుంచి ఇక తనదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.
ఇక రాజమౌళి తర్వాత ఇటీవలే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు భారత దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది.ఏప్రిల్ 14వ తేదీన విడుదలైన కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా 1000 కోట్ల క్లబ్ ను సాధించింది.
ఇక వీరు కాకుండా పాన్ ఇండియా క్లబ్ లో ఇప్పుడు ఉన్న మిగతా దర్శకుడు ఎవరు అన్నది చూస్తే.
ఇంతకు ముందు సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని పాన్ ఇండియా కేటగిరిలో తెరకెక్కించి సురేందర్‌రెడ్డి తాను కూడా పాన్ ఇండియా సినిమా తీయగలను అని నిరూపించాడు.ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి అన్న విషయం తెలిసిందే.
ఇటీవలే పుష్ప సినిమాతో ఒకసారిగా పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయాడు సుకుమార్.
ఇక పుష్ప 2 తో సుకుమార్ మరో మెట్లు ఎక్కడం ఖాయం అని తెలుస్తోంది షారుక్ ఖాన్ తో సినిమా తీస్తున్న కన్నడ దర్శకుడు అట్లీ కూడా పాన్ ఇండియా దర్శకుడి రేస్ లోకి వచ్చేందుకు రెడీగా ఉన్నాడు.
ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేస్తున్న ఓం రౌత్ కూడా పాన్ ఇండియా డైరెక్టర్ గా మరేందుకు రెడీ అయ్యాడు.రాజకుమార్ హిరని, బంసాలి, రోహిత్ శెట్టి, బోయ అక్తర్, కరణ్‌జోహార్ లాంటి ప్రతిభావంతులైన డైరెక్టర్లు హిందీ హీరోల తోనే పని చేస్తూ ఉంటారు.ఇతర భాషల్లో విడుదల చేసేందుకు పెద్దగా ఆసక్తి కూడా చూపలేదు ఇలాంటి నేపథ్యంలో సౌత్ సినిమా అటు ఉత్తరాది ప్రేక్షకులను బ్రహ్మరథం పడుతున్నారు.
దీంతో సౌత్ సినిమాలపై అక్కడ కూడా హవా పెరిగిపోయింది.