పాకిస్తాన్ దేశానికి బ్యాడ్ టైం నడుస్తున్నట్లు అర్థం అవుతోంది.ఇటీవలే అక్కడ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పడిపోవడం తెలిసింది.
ఇటువంటి తరుణంలో పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వం వార్నింగ్ ఇవ్వటం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.విషయంలోకి వెళితే ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ భూభాగంపై పాకిస్తాన్ ఆర్మీ గగనతలం నుండి బాంబుల వర్షం కురిపించడం జరిగింది.
దీంతో తాజాగా తాలిబాన్ ప్రభుత్వం పాకిస్తాన్ వ్యవహారం పై తీవ్రస్థాయిలో మండిపడింది.తమ దేశంపై దండయాత్ర చేయాలని చూస్తే.
పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.తాలిబాన్ ల వ్యవస్థాపకుడు ముల్లా మొహమ్మద్ ఒమర్ కుమారుడు.
.ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక రక్షణమంత్రి ముల్ల మొహమ్మద్ యాకుబ్ మాట్లాడుతూ… యావత్ ప్రపంచంతో పాటు పొరుగు దేశం పాకిస్తాన్ నుండి కూడా సమస్యలు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.
ఇందుకు నిదర్శనం పాకిస్తాన్ ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ భూభాగంలో కునార్ పై దాడి చేయడమే అని అన్నారు.తమ దేశంపై పాకిస్తాన్ గగనతలం నుండి చేసిన దాడులను క్షమించే ప్రసక్తే లేదని తెలిపారు.
దేశ ప్రాధాన్యతల కోసం ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాం.మరోసారి రిపీట్ అయితే… పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే పాకిస్తాన్ చేసిన గగనతలం దాడిలో 36 మంది ఆఫ్ఘన్ పౌరులు చనిపోయారు.చనిపోయిన వారిలో అత్యధికులు చిన్నారులు.
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ ప్రభుత్వం స్థాపించిన నాటి నుండి పాకిస్తాన్ ఆఫ్గనిస్తాన్ సరిహద్దుల వద్ద ఎన్నో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.