ధర్నా విషయంలో టీఆర్ఎస్ పై మొదలైన విమర్శలు... ఎందుకంటే

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల అంశం పెద్ద ఎత్తున రాజకీయంగా ఎంతగా హాట్ టాపిక్ గా మారిందో మనకు తెలిసిందే.అయితే వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ఇతర రాష్ట్రాలలో ఏ విధానాన్ని అయితే అనుసరిస్తున్నామో అదే విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేస్తామని సరికొత్త విధానమంటూ ఏమీ లేదని నూకల బియ్యాన్ని కొనుగోలు చేసే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే.

 Criticisms That Started On Trs In The Case Of Dharna Details,ktr, Harish Rao, Cm-TeluguStop.com

అయితే నిన్న టీఆర్ఎస్ నియోజకవర్గ వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించిన విషయం తెలిసిందే.అయితే ఈ ధర్నాల్లో టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్న విషయం తెలిసిందే.

అయితే టీఆర్ఎస్ పై కేంద్రంపై పెద్ద ఎత్తున పోరాటం నేపథ్యంలో ఈ ధర్నాలో ఇటు హరీష్ రావు కానీ, కెటీఆర్ కాని, కవిత కానీ ఎవరూ ఈ వరి ధాన్యం కొనుగోలు ధర్నాలో పాల్గొనకపోవడంతో కొంత టీఆర్ఎస్ శ్రేణుల నుండే అసంతృప్తి వ్యక్తమయినట్టు తెలుస్తోంది.దీంతో ఇప్పుడు ఈ వార్త రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

నాయకులు నిరసనలలో పాల్గొంటేనే కార్యకర్తలలో జోష్ వస్తుందని అప్పుడే ఇంకా రానున్న రోజుల్లో మరింతగా కార్యకర్తలకు పార్టీ పిలుపును పాటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telugu @harish2you, @ktrtrs, @raokavitha, @trspartyonline, Central, Cm Kcr, Piyu

అయితే ఈ ప్రచారంపై టీఆర్ఎస్ శ్రేణులెవరూ స్పందించిన పరిస్థితి లేదు.ఏది ఏమైనా మరల రానున్న రోజుల్లో చేపట్టబోయే నిరసనల్లో  టీఆర్ఎస్ కీలక నేతలు పాల్గొంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది.అయితే టీఆర్ఎస్ నిరసనలపై  కేంద్రం నుండి ఎటువంటి స్పందన రాకపోవడం కొంత ఆశ్చర్యకరమైన విషయం.

మరి టీఆర్ఎస్ పార్టీ ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటుందా లేదా అన్నది ఇప్పుడే మనం స్పష్టంగా చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో జరిగే పరిణామాలను బట్టి మనకు తెలిసే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube