అక్కడ ఇల్లు కేవలం రూ.85.. అయినా కొనేందుకు జనం వణుకు!

ఆ దేశంలోని ఒక పట్టణంలో, పాత ఇళ్లను కేవలం ఒక యూరోకు అమ్ముతుండటంతో ప్రజలు ఈ ఆస్తులు కొనడానికి ఎగబడ్డారు.అయితే ఆ తరువాత ఒక సమస్య తలెత్తింది.

 House Is Being Sold For Just Rs 85, Mussomeli, Sicily, Italy, The Mirror, Danny-TeluguStop.com

ఈ కారణంగా ప్రజలు తమ ఇళ్లను విక్రయించాల్సి వచ్చింది.కరోనా మహమ్మారి కారణంగా అనేక దేశాలలో ప్రజలు ఉపాధి కోల్పోయారు.

కొన్ని దేశాలలో స్థానిక పరిపాలన అధికారులు కొన్ని షరతులతో పాత ఇళ్లను ఒక డాలర్ లేదా ఒక యూరోకు విక్రయించే పథకాన్ని ప్రవేశపెట్టారు.ఉదాహరణకు ఈ కేసును తీసుకుంటే. ఇటలీలోని సిసిలీలోని ముస్సోమెలిలో కేవలం ఒక యూరో (రూ.85)కే ఓ చిన్న ఇంటిని విక్రయించారు.దీనిని కొనుగోలు చేసిన బ్రిటన్‌‌లో ఉంటున్న ఆస్ట్రేలియన్ వ్యక్తికి సంబంధించిన ఉదంతాన్ని ‘ది మిర్రర్‘ అందిచింది.ఈ ఇంటిని కొనుగోలు చేసేందుకు పలువురు ఆసక్తి చూపారు.అయితే ఆ వ్యక్తి ఏవో కారణాలతో ఆ స్థలాన్ని విడిచిపెట్టవలసి ఉన్నప్పటికీ, ప్రభుత్వ షరతు ప్రకారం అతను ఆ పాత ఇంటిని మూడు సంవత్సరాలలో పునరుద్ధరించవలసి ఉంది.

డానీ మెక్‌కబ్బిన్ సిసిలీలోని కాల్టానిసెట్టా ప్రావిన్స్‌లో ఉన్న ముస్సోమెలి పట్టణంలో ఒక ఇంటిని కొనుగోలు చేశాడు.

ముస్సోమెలిని 14వ శతాబ్దంలో మాన్‌ఫ్రెడో III చియారామోంటే ‘మాన్‌ఫ్రెడి‘ పేరుతో స్థాపించారని చరిత్ర చెబుతోంది.ప్రస్తుతం, ఈ ప్రదేశంలో విదేశీయులను స్థిరపరిచేందుకు ‘కేస్ 1 యూరో’ ప్రాజెక్ట్ ప్రారంభించారు.

ఈ ప్రాజెక్ట్ కింద డానీ మెక్‌కబ్బిన్ ఒక యూరో (సుమారు 85 రూపాయలు) చెల్లించి ఇక్కడ ఒక ఇంటిని కొనుగోలు చేశాడు.మెక్‌కబ్బిన్ ఇటలీలో ఇంటి యజమాని కావడానికి ముందు 17 సంవత్సరాలు బ్రిటన్‌లో నివసించాడు.

ఇల్లు కొనుగోలు చేసిన ఒక సంవత్సరం తర్వాత దానిని పునరుద్ధరించడానికి కూలీలను వెదకలేకపోయాడు.ఎందుకంటే గత కొన్ని నెలలుగా ఇటలీ కార్మికుల కొరత నెలకొంది.ఫలితంగా డానీ మెక్‌కబ్బిన్ ఈ ఆస్తిని విక్రయించాల్సి వచ్చింది.ఇంటిని పునరుద్ధరించేందుకు బిల్డర్లు దొరకడం లేదని డానీ మెక్‌కబ్బిన్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube