సూపర్ స్టార్ రజినికాంత్ వరుస సినిమాలు చేస్తున్నారు.యంగ్ డైరక్టర్స్ కు ఛాన్స్ ఇస్తూ కొత్త కొత్త కథలతో ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నారు.
ఈ క్రమంలో రజిని 169వ సినిమా రంగం సిద్ధమైంది. సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది.
సినిమా కు సంబందించిన మరో అప్డేట్ ప్రేక్షకులను అలరిస్తుంది.సినిమాలో యంగ్ హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ను సెలెక్ట్ చేశారట.
సినిమాలో ఆమె హీరోయిన్ గా చేస్తుందా లేక రజిని డాటర్ రోల్ చేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.రజినికాంత్ ఈమధ్యనే అన్నాత్తే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఆ సినిమా డైరక్టర్ శివ తోనే మరో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి.అయితే నెల్సన్ దిలీప్ కుమార్ తో కూడా రజిని సినిమా ఉంటుందని తెలుస్తుంది.
నెల్సన్ దిలీప్ కుమార్ ప్రస్తుతం దళపతి విజయ్ తో బీస్ట్ సినిమా చేస్తున్నారు.బీస్ట్ హిట్ అయితే మాత్రం రజిని సినిమాపై ఇంకా అంచనాలు పెరిగే ఛాన్స్ ఉంది.
నెల్సన్ దిలీప్ కుమార్ తో రజిని సినిమా చాలా స్టైలిష్ గా ఉండబోతుందని తెలుస్తుంది.