తెలుగుదేశం పార్టీ ఖమ్మం నగర కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ గ్యాస్ డీజిల్ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ బిల్లులు వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు .అనంతరం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగినది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెంచిన నిత్యావసర వస్తువులు మరియు విద్యుత్ ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకొని పేద బడుగు బలహీన వర్గాల పై భారం మోపడం తగదని ,ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షులు కూర పాటి.వెంకటేశ్వర్లు అన్నారు .ఇటీవల దేశ ప్రజలను రాష్ట్ర ప్రజలను పీడిస్తున్న కరోన మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయి పని చేసేవారికి పనిలేక ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితుల్లో పేద ప్రజల ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు సాన బోయిన .శ్రీనివాస్ గౌడ్ ,నాగండ్ల .మురళి ,ప్రధాన కార్యదర్శి గుత్తా .సీతయ్య ,రాష్ట్ర మహిళా కార్యదర్శి మేకల .సత్యవతి ,ఖమ్మం నగర పార్టీ అధ్యక్షుడు వడ్డెమ్.విజయ్, రఘునాథ పాలెం మండల అధ్యక్షుడు పొట్లపల్లి .కోటేశ్వరావు, కొణిజర్ల మండల పార్టీ అధ్యక్షుడు తాత.సుధాకర్ రావు ,కూసుమంచి మండల ప్రధాన కార్యదర్శి మందపల్లి.కోటేశ్వరావు,పారిస్.
వెంకన్న ,నగరంలోని డివిజన్ అధ్యక్షులు కార్యదర్శులు తెలుగు యువత పార్లమెంట్ కార్యదర్శి లక్ష్మణ్ మునగపాటి .సంపత్ ,పాలూరి శ్రీనివాసరావు కందిబండ .నరసింహారావు ,ర0గిశెట్టి .మంగమ్మ ,నీరుడు.రాంబాబు ,గొర్రె ముchu.రాజు ,గుండప్ నేని .నాగేశ్వరావు, దొబ్బల .మోహన్ రావు తదితరులు పాల్గొని జిల్లా కలెక్టర్ కి మోరాండం ఇవ్వడం జరిగింది.