ఏ దేశం దగ్గర అత్యాధునిక భారీ ఆయుధాలు ఉన్నాయో తెలుసా?

అణ్వాయుధాలను తయారు చేయడం ప్రారంభించి, వాటిని ఉపయోగించిన మొట్ట మొదటి దేశం అమెరికా. 1940 నుండి 1996 వరకు, యూఎస్‌ ప్రభుత్వం అణ్వాయుధాల కోసం 8.8 డాల‌ర్ల ట్రిలియన్లు ఖర్చు చేసింది.ప్రపంచంలో అణ్వాయుధాలను ఉపయోగించిన మొదటి దేశం అమెరికా.

 These Countries Have The Largest And Dangerous Stockpile Details, Countries, Wea-TeluguStop.com

ప్రస్తుతం, అమెరికా వద్ద 5800 అణ్వాయుధాలు ఉన్నాయి.వాటిలో 1,750 అణ్వాయుధాలు చురుకుగా ఉన్నాయి.

ప్రపంచంలో అమెరికా తర్వాత అణుపరీక్ష నిర్వహించిన రెండో దేశం రష్యా.రష్యా 1949 ఆగస్టు 29న మొదటి అణు పరీక్ష నిర్వహించింది.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌కు సోవియట్ అణు బాంబు ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు.అక్టోబర్ 24, 1990న రష్యా తన చివరి అణు పరీక్షను నిర్వహించింది.

రష్యా వద్ద ప్రస్తుతం మొత్తం 6372 అణ్వాయుధాలు ఉన్నాయి.

వాటిలో 1,790 ఆయుధాలు చురుకుగా ఉన్నాయి.

వచ్చే 10 ఏళ్లలో అణు సామర్థ్యం పరంగా అమెరికాను అధిగమించేందుకు సిద్ధంగా ఉన్న చైనా, ప్రస్తుతం 320 అణ్వా యుధాలను కలిగి ఉంది.ఏదీ క్రియా శీలంగా లేదు.

చైనా తన మొదటి అణు పరీక్షను 1964 అక్టోబర్ 16న నిర్వహించింది.చివరి పరీక్ష 29 జూలై 1996న జరిగింది.

  మనం ఫ్రాన్స్ గురించి మాట్లాడినట్లయితే, అది రష్యా, అమెరికా కంటే చాలా వెనుక బడి ఉంటుంది.ఫ్రాన్స్ తన మొదటి అణు పరీక్షను 13 ఫిబ్రవరి 1960న నిర్వహించింది.

చివరి అణు పరీక్ష 1996 జనవరి 27న జరిగింది.

Telugu America, Atomic Bombs, China, Stockpile, France, India, Israel, Korea, Nu

ప్రస్తుతం ఫ్రాన్స్ వద్ద 300 అణ్వాయుధాలు ఉన్నాయి.వాటిలో 290 క్రియాశీలకంగా ఉన్నాయి.భారతదేశం తన అణు కార్యక్రమాన్ని 1967లో ప్రారంభించింది.

మొదటి అణు పరీక్ష 1998లో జరిగింది.ఇప్పటివరకు దాదాపు ఆరు అణు పరీక్షలు జరిగాయి.

భారత్ వద్ద ఉన్న అణ్వాయుధాల సంఖ్య 150.కాగా భారత్ 400 నుంచి 500 అణ్వాయుధాలను తయారు చేయగల సామ‌ర్థ్యం ఉంద‌ని స‌మాచారం.ఉత్తర కొరియా ద‌గ్గ‌ర ప్రస్తుతం 30 నుంచి 40 అణ్వాయుధాలు ఉన్నాయి.ఇజ్రాయెల్ విషాయానికొస్తే ఆ దేశంలో 90 అణ్వాయుధాలున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube