సోలార్ క్యాలెండర్ ఎక్కడ ఉంది? దీని ప్ర‌యోజ‌నం తెలిస్తే షాక‌వుతారు

సోలార్ క్యాలెండర్ అంటే చారిత్రక స్టోన్‌హెంజ్.ఇది 5000 సంవత్సరాల క్రితం ఇంగ్లండ్‌లో రూపొందింది.

 Secret Of Stonehenge And Its A Solar Calendar, Solar Calendar , Stonehenge, Engl-TeluguStop.com

అయితే దీనిని ఎవరు తయారు చేశారు? దీని వెనుక ఉద్దేశ్యం ఏమిట‌నేది నేటికీ మిస్టరీగానే ఉంది.దీని గురించి తెలుసుకోవడానికి చాలా మంది శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి పరిశోధనలు చేస్తున్నారు.

తాజాగా జరిగిన పరిశోధనల్లో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.రాళ్లతో చేసిన ఈ స్టోన్ హెంజ్ ఒక రకమైన సోలార్ క్యాలెండర్ అని పరిశోధనలు సాగించిన‌ బోర్న్ మౌత్ యూనివర్సిటీకి చెందిన ఆర్కాలజిస్ట్ ప్రొ.

తిమోతీ డ్రేవిల్లే తెలిపారు.స్టోన్‌హెంజ్‌లో గుర్రపుడెక్క ఆకారంలో 15 రాళ్లు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఈ రాళ్ల ఆకృతి వివిధ రకాలుగా ఉంటుంది.అవి సౌర క్యాలెండర్ లాగా పనిచేస్తాయి.

ఈ మొత్తం పని ఒక నెల రోజుల‌ను తెలియ‌జేస్తుంది.ఇంతే కాకుండా 24 రాళ్ల వృత్తం ఒక రోజుని గంటలలా సూచిస్తుంది.

స్టోన్‌హెంజ్‌ను చారిత్రక క్యాలెండర్‌గా నాటిరోజుల్లో ఉపయోగించారని పరిశోధకులు చెబుతున్నారు.అయితే దీనిపై ఇంగ్లండ్ ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

కొంతమంది స్థానిక ప్రజలు ఈ రాళ్ల సమూహ దేవాలయం లేదా స్మశానవాటిక కావచ్చునని అంటుంటారు.అదే సమయంలో ఇది ప్రార్థనా స్థలం అయివుంటుంద‌ని కొందరు నమ్ముతారు.

Telugu Solar Calendar-Latest News - Telugu

స్టోన్‌హెంజ్ ఎగువ, బయటి భాగాలు హీల్ స్టోన్, స్లేటర్ స్టోన్,స్టేషన్ స్టోన్‌తో రూపొందాయి.స్టోన్‌హెంజ్ గురించి చరిత్రకారులు వేసవిలో సూర్యుడు తూర్పు-ఉత్తర దిశలో హీల్ స్టోన్ వెనుక నుండి ఉదయిస్తాడని తెలిపారు.దాని మొదటి కిరణం స్టోన్‌హెంజ్‌పై పడుతుంది.అయితే శీతాకాలంలో, సూర్యాస్తమయం మధ్యలో ఉంటుంది, ఇది నైరుతి దిశలో ఉంటుంది.స్టోన్‌హెంజ్ ప్రకారం వారానికి 10 రోజులు ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు.ఇది ఒక ప్రత్యేక క్యాలెండర్.3,000 BC తర్వాత తూర్పు మధ్యధరా ప్రాంతంలో అటువంటి సౌర క్యాలెండర్ అభివృద్ధి చేశారు.క్రీస్తుపూర్వం 2,700లో ఈజిప్టు కూడా దీనిని స్వీకరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube