మంచు విష్ణు హీరోగా ఓ సినిమా మొదలైంది.ఈ సినిమాలో మంచు హీరో గాలి నాగేశ్వర రావు పాత్రలో నటిస్తున్నారు.
సినిమాకు సంబందించిన షూటింగ్ తిరుపతిలో ప్లాన్ చేశారు.సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుంది.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో మంచు విష్ణు పాయల్ రాజ్ పుత్ ల రోమాన్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ భామ సన్నీ లియోన్ ని కూడా తీసుకున్నారట.
సినిమాలో సన్నీ లియోన్ రేణుక పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది.అంతకు ముందు మంచు మనోజ్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసిన సన్నీ లియోన్ ఇప్పుడు మరోసారి మంచు వారి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
సన్నీ లియోన్ అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండరని చెప్పొచ్చు.తన హాట హాట్ ఫోజులతో కుర్రాళ్లని మంత్రముగ్దుల్ని చేసే అమ్మడు తప్పకుండా మంచు విష్ణు సినిమాతో మరోసారి అలరిస్తుందని అంటున్నారు.
సినిమాలో ఆమె పాత్ర స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని టాక్. మంచు విష్ణు ఢీ & ఢీ తర్వాత చేస్తున్న సినిమాగా ఇది రాబోతుంది.