ప్రపంచ క్రికెట్ లో తీవ్ర విషాదం నెలకొంది.ఇద్దరు దిగ్గజాలు గుండెపోటుతో మరణించారు.
అది కూడా 12 గంటల వ్యవధిలోనే.అందులోనూ వారిద్దరూ ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ కావడం ఆ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా వేధించే అంశం.
అత్యుత్తమ బౌలర్లలో ఒకరైన ఆస్ట్రేలియ్ క్రికెటర్ షేన్ వార్న్, మరొక ఆసీస్ వెటరన్ రాడ్ మార్ష్ మరణించి 12 గంటల వ్యవధిలోనే మరణించాడు.
రాడ్ మార్ష్ భారీ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోవడంపై షేన్ వార్న్ ట్విట్టర్ లో స్పందించాడు.
“రాడ్ మార్ష్ క్రికెట్ లో అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడు.రాడ్ మార్ష్ మరణించాడన్న వార్త వినడం బాధాకరం.అతను క్రికెట్ లో ఒక లెజెండ్ & చాలా మంది యువకులకు & అమ్మాయిలకు రాడ్ మార్ష్ నిజమైన ప్రేరణ.రాడ్ క్రికెట్ కు ఎంతో చేశాడు.
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లకు అతడు ఆడిన ఆట మరపురానిది.RIP సహచరుడా” అని వార్న్ ట్వీట్ చేసాడు.
దీనికి కొద్ది రోజుల క్రితం, వార్న్ తాను తిరిగి ఫిట్ గా తయారవ్వాలని అనుకుంటున్నానని తన ఆకృతిని ఎలా పొందాలనుకుంటున్నాడో తెలియజేస్తూ దాని గురించి ట్వీట్ చేసాడు.ఆపరేషన్ ష్రెడ్ ప్రారంభిస్తున్నానని.10 రోజులలో తన మునుపటి శరీరాకృతి పొందాలని అదే తన గోల్ అంటూ ట్వీట్ చేశాడు.ఈ ట్వీట్ కు తన ఎన్నో సంవత్సరాల నాటి ఫోటోనూ కూడా జత చేశాడు షేన్ వార్న్.
ప్రస్తుతం థాయ్ లాండ్ లో ఉన్న వార్న్ తన గదిలో విగతజీవిగా పడి ఉండటంతో విల్లా సిబ్బంది హుటా హుటినా థాయ్ లాండ్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు.అయితే వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.షేన్ వార్న్ గుండె పోటుతో తుది శ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు.
షేన్ వార్న్ క్రికెట్ కు ఎంతో సేవ చేశాడు.1992లో జాతీయ జట్టుకు ఎంపికైనా షేన్.ఆసీస్ జట్టులో అనతికాలంలోనే కీలక బౌలర్ గా ఎదిగాడు.దాదాపు 15 ఏళ్ల పాటు సేవలందించిన వార్న్.2007లో అంతర్జాతీయ క్రికెట్ రిటైర్ మెంట్ ప్రకటించారు.శ్రీలంక ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ తర్వాత అత్యధికంగా వికెట్లు తీసిన బౌలర్ గా గుర్తింపు సంపాదించాడు వార్న్.తన కెరీర్ లో అన్ని వికెట్లు కలుపుకుని వార్న్ తీసిని వికెట్ల సంఖ్య 708.