లైగర్ సినిమాతో డైరక్టర్ పూరీ జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండల మధ్య మంచి బాండింగ్ ఏర్పడినట్టు ఉంది.అందుకే లైగర్ పూర్తి కాగానే జన గణ మన అంటూ మరో సినిమా షురూ చేయబోతున్నారు.
అసలైతే పూరీ ఈ సినిమాని సూపర్ స్టార్ మహేష్ తో చేయాలని అనుకున్నాడు.కానీ లైగర్ టైం లో విజయ్ తో కలిసి పనిచేస్తుంటే అతని టాలెంట్ పసిగట్టేసిన పూరీ జగన్నాథ్ జన గణ మన సినిమా హీరోని మార్చేశాడు.
ఈ క్రమంలో త్వరలోనే విజయ్ దేవరకొండ తో ఈ సినిమా మొదలుపెడతారని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్ కన్నా ఇప్పుడు బడ్జెట్ పెంచినట్టు తెలుస్తుంది.
జన గణ మన సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట పూరీ జగన్నాథ్.ఈ సినిమా ప్రొడక్షన్ లో ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ కూడా పాలు పంచుకుంటాడని తెలుస్తుంది.
మొత్తానికి జన గణ మన మొదట్లో ఒక 50 నుండి 60 కోట్లతో పూర్తి చేద్దామనుకున్న పూరీ ఇప్పుడు ఆ సినిమాను 100 కోట్ల పైన బడ్జెట్ తో తీయాలని ఫిక్స్ అయ్యాడట.పూరీ సినిమాలు చాలా తక్కువ బడ్జెట్ తో వస్తాయి.
జన గణ మన 100 కోట్లు బడ్జెట్ పెడితే మాత్రం ఆ లెక్క వేరేలా ఉంటుంది.