జన గణ మన బడ్జెట్ పెరిగిందా..?

లైగర్ సినిమాతో డైరక్టర్ పూరీ జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండల మధ్య మంచి బాండింగ్ ఏర్పడినట్టు ఉంది.

అందుకే లైగర్ పూర్తి కాగానే జన గణ మన అంటూ మరో సినిమా షురూ చేయబోతున్నారు.

అసలైతే పూరీ ఈ సినిమాని సూపర్ స్టార్ మహేష్ తో చేయాలని అనుకున్నాడు.

కానీ లైగర్ టైం లో విజయ్ తో కలిసి పనిచేస్తుంటే అతని టాలెంట్ పసిగట్టేసిన పూరీ జగన్నాథ్ జన గణ మన సినిమా హీరోని మార్చేశాడు.

ఈ క్రమంలో త్వరలోనే విజయ్ దేవరకొండ తో ఈ సినిమా మొదలుపెడతారని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్ కన్నా ఇప్పుడు బడ్జెట్ పెంచినట్టు తెలుస్తుంది.

జన గణ మన సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట పూరీ జగన్నాథ్.

ఈ సినిమా ప్రొడక్షన్ లో ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ కూడా పాలు పంచుకుంటాడని తెలుస్తుంది.

మొత్తానికి జన గణ మన మొదట్లో ఒక 50 నుండి 60 కోట్లతో పూర్తి చేద్దామనుకున్న పూరీ ఇప్పుడు ఆ సినిమాను 100 కోట్ల పైన బడ్జెట్ తో తీయాలని ఫిక్స్ అయ్యాడట.

పూరీ సినిమాలు చాలా తక్కువ బడ్జెట్ తో వస్తాయి.జన గణ మన 100 కోట్లు బడ్జెట్ పెడితే మాత్రం ఆ లెక్క వేరేలా ఉంటుంది.

దేవర హిట్టైనా అనిరుధ్ ను నమ్మట్లేదా.. వాళ్లు ఈ మ్యూజిక్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వట్లేదా?