'సెబాస్టియన్‌ పిసి524'లో 'సెబా...' లిరికల్ విడుదల

‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమైన కిరణ్‌ అబ్బవరం, తొలి సినిమాతో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నారు.రెండో చిత్రం ‘ఎస్‌.ఆర్‌.కళ్యాణమండపం’తో సాలిడ్‌ సక్సెస్‌ అందుకున్నారు.క్లాసు – మాసు, యూత్‌ – ఫ్యామిలీ… ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అభిమానులను సొంతం చేసుకున్నారు.మార్చి 4న ‘సెబాస్టియన్‌ పిసి 524’తో హ్యాట్రిక్‌ హిట్‌ అందుకోవడానికి రెడీ అవుతున్నారు.

 Lyrical Release Of 'seba ' On 'sebastian‌ Pc524' , Sebastian‌ Pc524, Siddha-TeluguStop.com

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘సెబాస్టియన్‌ పిసి524‘.కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లు.

జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించారు.బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు.

ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేస్తోంది.మార్చి 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

ఈ రోజు సినిమాలో ‘సెబా…’ సాంగ్ విడుదల చేశారు.

కంటిలోన చీకటిని, గుండెలోన దాచుకుని… వేదనలో వేడుకలా వెలుగు సెబా… రాజాధి రాజా! వదిలిపోని వేకువని, తిరుగులేని రేపటిని… ఏలుకొనే ఏలికలా ఎదురు సెబా… రాజాధి రాజా! – ఇలా చక్కటి సాహిత్యంతో, సినిమాలో కథానాయకుడి పరిస్థితి గురించి వివరిస్తూ ‘సెబా…’ పాట సాగింది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.“మా ‘సెబాస్టియన్‌ పిసి524’ కిరణ్ అబ్బవరం కచ్చితంగా హ్యాట్రిక్‌ హిట్‌ అందుకుంటారు.ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.‘హేలీ…’ పాటలు మంచి స్పందన లభించింది.ఇప్పుడీ ‘సెబా…’ పాట సైతం విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మంచి స్పందన అందుకుంది.జిబ్రాన్‌ సంగీతం దర్శకత్వంలో పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి.రేచీకటి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.రేచీకటి గల హీరోకి పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం వస్తుంది.

అతడు నైట్‌ టైం డ్యూటీ ఎలా చేశాడు? రేచీకటి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది సినిమా కథాంశం.మార్చి 4వ తేదీన ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు” అని అన్నారు.

కిరణ్‌ అబ్బవరం, కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దారేకర్‌), శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సూర్య, రోహిణీ రఘువరన్‌, ఆదర్ష్‌ బాలకృష్ణ, జార్జ్‌, సూర్య, మహేష్‌ విట్టా, రవితేజ, రాజ్‌ విక్రమ్‌, లత, ఇషాన్‌, రాజేష్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్రకుమార్‌ నాయుడు`ఫణి కందుకూరి (బియాండ్‌ మీడియా), డిజిటల్‌ పార్ట్‌నర్‌: టికెట్‌ ఫ్యాక్టరీ, పబ్లిసిటీ డిజైన్‌: చవన్‌ ప్రసాద్‌, స్టిల్స్‌: కుందన్‌ – శివ, సౌండ్‌: సింక్‌ సినిమాస్‌ సచిన్‌ సుధాకరన్‌, కాస్ట్యూమ్స్‌: రెబెకా – అయేషా మరియమ్‌, ఫైట్స్‌: అంజి మాస్టర్‌, సిజి: వీర, డీఐ: రాజు, కూర్పు: విప్లవ్‌ న్యసదాం, కళ: కిరణ్‌ మామిడి, ఛాయాగ్రహణం: రాజ్‌ కె.నల్లి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కె.ఎల్‌.మదన్‌, సమర్పణ: ఎలైట్‌ ఎంటర్టైన్మెంట్స్‌, నిర్మాణ సంస్థ: జ్యోవిత సినిమాస్‌, సంగీతం: జిబ్రాన్‌, నిర్మాతలు: సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, ప్రమోద్‌, రాజు, కథ – దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి.

Lyrical Release Of Seba On Sebastian‌ PC524

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube