'26 ఏళ్లుగా అదే స్టార్ డమ్ మైంటైన్ చేయడం గ్రేట్'.. పవన్ పై కేటీఆర్ ప్రశంసలు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా గురించే ప్రస్తుతం అందరు మాట్లాడుకుంటూ ఉన్నారు.సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మల్టీ స్టారర్ గా రూపొందుతుంది పవన్ కళ్యాణ్ తో పాటు రానా దగ్గుబాటి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

 Minister Ktr Speech At Bheemla Nayak Pre Release Event , Bheemla Nayak , Bheemla-TeluguStop.com

భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న రిలీజ్ కాబోతుంది.రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ క్రమంలో వరుస ప్రమోషన్స్ చేస్తూ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తున్నారు మేకర్స్.నిన్న ఈ సినిమా ఆపే రిలీజ్ ఈవెంట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ వేడుక యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా నిర్వహించారు.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా మంత్రులు కేటీఆర్, తలసాని హాజరయ్యారు.

ఈ వేడుకలో కేటీఆర్ మాట్లాడుతూ.

నాలుగేళ్ళ క్రితం ఇదే గ్రౌండ్ లో చిరంజీవి, రామ్ చరణ్ పిలిచిన ఒక సినిమా ఫంక్షన్ కు హాజరయ్యానని.అప్పుడు మెగాస్టార్, ఆయన సోదరుడు పవర్ స్టార్ అని మాట్లాడుతూ ఉంటే.తనను అభిమానులు అరుపులతో మాట్లాడనివ్వలేదని.ఇప్పుడు కూడా తనని మాట్లాడ నివ్వడం లేదని కేటీఆర్ నవ్వుతు అన్నారు.26 ఏళ్లుగా ఒకే విధమైన స్టార్ డమ్ మైంటైన్ చేయడం మాములు విషయం కాదు అన్నారు.

అది కేవలం పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం అయ్యింది అని తెలిపారు.ఈ సందర్భంగా తాను కూడా కాలేజ్ రోజుల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాను చూశానని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.

గత 8 ఏళ్లుగా కేవలం తెలుగు పరిశ్రమ కోసమే కాకుండా భారదేశం చలనచిత్ర పరిశ్రమకు హైదరాబాద్ సినీ హబ్ గా మారిందని కేటీఆర్ తెలిపారు.సినిమా ఇండస్ట్రీ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సహకారాన్ని అయినా అందిస్తుందని చెప్పుకొచ్చారు కేటీఆర్.

Minister KTR Speech At Bheemla Nayak Pre Release Event

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube