సంజయ్ మాటే చెల్లుబాటు... వారిపై వేటు ?

సొంత పార్టీలోనే విపక్షం ఉండడంతో , తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గత కొంత కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఒకవైపు అధికార పార్టీ టిఆర్ఎస్ ను ఎదుర్కొంటూ సరికొత్త కార్యక్రమాలని రూపొందించుకుని పార్టీని అధికారంలోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగా , కొంత మంది అసంతృప్తి నేతలంతా ఒక గ్రూపుగా ఏర్పడి రహస్య సమావేశాలు నిర్వహిస్తుండడం వంటి వ్యవహారాలను సంజయ్ తీవ్రంగానే తీసుకున్నారు.

ఈ వ్యవహారాలపై అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు.వారిపై వెంటనే చర్యలు తీసుకుంటే పార్టీలో గందర గోళం ఏర్పడుతుందని భావించి వారికి వార్నింగ్ ఇచ్చి సరిపెట్టారు.

అయినా పరిస్థితుల్లో మార్పు రాక పోవడం, రెండు రోజుల క్రితం అసంతృప్తి నేతలంతా హైదరాబాద్ లో మళ్ళీ రహస్యంగా సమావేశం కావడం వంటి వ్యవహారంను బీజేపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది.ఈ మేరకు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి వ్యవహరిస్తున్న నేతలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.

ఈ మేరకు ఇటీవల హైదరాబాదులో రహస్యంగా సమావేశం నిర్వహించిన నాయకులు అందరికీ షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నోటీసులకు వారు ఇచ్చే వివరణ సంతృప్తిగా ఉంటే సరి,  లేకపోతే వారిపై సస్పెన్షన్ వేటు తప్పదనే సంకేతాలు కూడా ఇచ్చింది.

Advertisement

బిజెపి లో తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి , సీనియర్ నాయకుడు సుగుణాకర్ రావు ఆధ్వర్యంలో కొంత మంది అసంతృప్త సమావేశాలను నిర్వహిస్తున్నారు.

అయితే వీరిపై చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల , కరీంనగర్ , పెద్దపల్లి,  జగిత్యాల జిల్లాలకు చెందిన కోర్ కమిటీ తీర్మానం చేసి జాతీయ,  రాష్ట్ర నాయకత్వాలకు తీర్మానాలు పంపిన నేపద్యంలో  గుజ్జుల రామకృష్ణారెడ్డి, సుగుణాకర్ రావు తదితరులు పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా బీజేపీ అధిష్టానం సంజయ్ కు సూచించినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు