ఎన్టీఆర్ నన్ను ర్యాగింగ్ చేశారు.. అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్ వైరల్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలో పాత్రకు తగిన విధంగా పవర్ ఫుల్ గా కనిపిస్తారనే సంగతి తెలిసిందే.అయితే నిజ జీవితంలో మాత్రం తారక్ చాలా సరదాగా ఉంటారని ఆయన అభిమానులు, సన్నిహితులు చెబుతారు.

 Anil Ravipudi Shocking Comments About Young Tiger Ntr Goes Viral, Anil Ravipudi-TeluguStop.com

ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తారక్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కొన్నేళ్ల క్రితం కళ్యాణ్ రామ్ నటించిన పటాస్, ఎన్టీఆర్ నటించిన టెంపర్ దాదాపుగా ఒకే సమయంలో రిలీజయ్యాయి.

ఈ రెండు సినిమాల కథలు ఒకే విధంగా ఉన్నాయని ఇండస్ట్రీలో కామెంట్లు వినిపించాయి.అయితే బాక్సాఫీస్ వద్ద అటు పటాస్ ఇటు టెంపర్ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ పటాస్ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్, రవితేజ వచ్చారని పటాస్ విషయంలో సంతోషం ఏమిటంటే ఒకటి కళ్యాణ్ రామ్ విషయంలో జర్నీ అని పటాస్ ఫినిష్ అయ్యే సమయానికి జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా సెట్ కు వచ్చేవారని అనిల్ రావిపూడి వెల్లడించారు.

రోజూ సాయంత్రం సమయంలో నాకు ర్యాగింగ్ ఉండేదని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.జూనియర్ ఎన్టీఆర్ ఆడుకుంటారని ఆ ఆడుకోవడం కూడా మామూలుగా కాదని అనిల్ రావిపూడి వెల్లడించారు.ర్యాగింగ్ అంటే బాధ పెట్టేలా కాదని ఎన్టీఆర్ సెట్ లో అల్లరి చేసేవారని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.

కథ చెప్పవా కథ చెప్పవా అంటూ అన్నయ్యా అనిల్ కథ చెప్పనని అంటున్నాడని కళ్యాణ్ రామ్ తో తారక్ అనేవారని అనిల్ రావిపూడి కామెంట్లు చేశారు.

పటాస్ సినిమాను జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ కు ముందే చూసేశారని రెండు కథలకు సెంట్రల్ థాట్ ఒకటేనని యాదృచ్చికంగా ఈ రెండు సినిమాల విషయంలో అలా జరిగిందని అనిల్ రావిపూడి అన్నారు.తాను, పూరీ జగన్నాథ్ వేర్వేరు స్టైల్స్ లో పటాస్, టెంపర్ లను తెరకెక్కించామని అనిల్ రావిపూడి వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube