భారత క్రికెట్ జట్టు దిగ్గజ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా బీసీసీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.సౌరవ్ గంగూలీ ఇచ్చిన హామీలన్నీ వట్టి అబద్ధాలేనని నిరూపితమవుతుంది అన్నట్లుగా సాహా తాజాగా మీడియా ఎదుట కోపతాపాలు చూపించాడు.
అలాగే చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ, కోచ్ ద్రవిడ్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు.శ్రీలంక సిరీసుకు టీమిండియా జట్టును ఫైనలైజ్ చేశాక సాహా మీడియాతో ముచ్చటిస్తూ ఈ ముగ్గురిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తాను బీసీసీఐ లో ఉన్నంత వరకు నువ్వు కచ్చితంగా జట్టులో ఉంటావని హమీ ఇస్తూ సౌరవ్ గంగూలీ వృద్ధిమాన్ సాహాకు ఓ వాట్సాప్ మెసేజ్ సెండ్ చేశాడు.కానీ ఇప్పుడు అతన్ని జట్టులో నుంచి పీకి పారేశారు.
అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న తనకు రెండు నెలల తర్వాత ఇలా చేయడం తన గుండెల్ని పిండే స్తోందని సాహా ఆవేదన వ్యక్తం చేశాడు.అందుకే బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీపై వృద్ధి మాన్ సాహా ఫైర్ అయ్యాడు.
ద్రవిడ్ కూడా రిటైర్ అయిపో అని ఇన్-డైరెక్ట్ గా తనకు చెప్పాడని వెల్లడించాడు.యువ ఆటగాళ్లను పరీక్షించాలనే ఉద్దేశంతో తనని తీసేస్తున్నామని ద్రవిడ్ చెప్పాడని.
ఇది కూడా తనను ఎంతగానో బాధించిందని వెల్లడించాడు.
శ్రీలంక సిరీసు కోసం జట్టు సెలక్షన్ పూర్తయ్యాక చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ తీరు పూర్తిగా మారిపోయిందని కూడా సాహా సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశాడు.ఇష్టమైతే రంజీ ట్రోఫీలో ఆడు.లేదంటే నీ ఇష్టం అన్నట్టుగా చేతన్ శర్మ చాలా నిర్లక్ష్యపు సమాధానం వినిపించాడని సాహా చెప్పుకొచ్చాడు.అయితే ఇలా ముగ్గురిపై సాహా ఫైర్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
అయితే ఎవరూ తనని కన్సిడర్ చేయక పోయినా క్రికెట్ నుంచి ఇప్పుడప్పుడే తప్పుకోనని సాహా కుండబద్దలు కొట్టాడు.
దక్షిణాఫ్రికా టూర్ సమయంలోనూ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు కూడా ఇదే విషయం స్పష్టం చేశానని దిగ్గజ క్రికెటర్ చెప్పాడు.తన సతీమణి ప్రస్తుతం డెంగీ నుంచి రికవర్ అవుతోందని.
ఆమెకు పూర్తిగా నయం అయిన తర్వాత క్రికెట్లో ఆడటం ప్రారంభిస్తామని చెప్పారు.త్వరలోనే బెంగాల్‌కు రంజీల్లో ఆడతానని పేర్కొన్నాడు.