మిస్ ఇండియా దర్శకుడు నరేంద్ర నాథ్ తో నిర్మాత మధు కాలిపు కొత్త చిత్రం

రంగమార్తాండ చిత్ర నిర్మాత మధు కాలిపు, కీర్తి సురేష్ మిస్ ఇండియా మూవీ దర్శకుడు నరేంద్రనాథ్ తో ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవబోతోంది.

 Narendranath Of Miss India Fame For His Next Project Which Is An Action Drama Un-TeluguStop.com

రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ లో మధు కాలిపు ఈ సినిమా నిర్మించబోతున్నారు.

రాజ శ్యామల సంస్థ కథకి ప్రాధాన్యత ఉన్న సినిమాలు నిర్మిస్తారు.

పెద్ద స్టార్స్ తో కమర్షియల్, భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే మంచి విలువలు, ఎమోషన్స్ ఉన్న సినిమాలని కూడా నిర్మిస్తారు.వాళ్ళ తదుపరి సినిమాలు అన్ని పాన్ ఇండియా సినిమాలే.ప్రస్తుతం మధు కాలిపు దర్శకుడు కృష్ణవంశీ తో ‘రంగమార్తాండ’ అనే సినిమా నిర్మిస్తున్నారు.‘రంగమార్తాండ‘ సినిమా, మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’ కి రీమేక్.ఆ సినిమా ఈ వేసవికి విడుదల కాబోతోంది.అయితే దర్శకుడు నరేంద్రనాథ్ తో ఈ బ్యానర్ లో ఒక యాక్షన్ డ్రామా తెరకెక్కబోతోంది.ఈ కొత్త సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో చిత్ర దర్శక నిర్మతలు ప్రకటించబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube