పవన్ కల్యాణ్ సినిమాలోని ఓ డైలాగ్ ఉంటుంది.రావడం లేట్ అవ్వొచ్చేమో గానీ.
రావడం మాత్రం పక్కా అనేది.అయితే ఈ డైలాగ్ ఇప్పుడు ఆయనకు పర్ ఫెక్ట్ గా సూట్ అయ్యేలా కనిపిస్తోంది.
ఎందుకంటే ఆయన ఇప్పుడు నిరుద్యోగుల తరఫున గళం విప్పుతున్నారు.ఇన్ని రోజులు ఏ విషయం మీద అయినా చాలా లేటుగా స్పందించే పవన్.
ఈ విషయం మీద మాత్రం చాలా త్వరగానే రియాక్ట్ అవడం ఇక్కడ విశేషం.కాగా ఆయన ఇన్ని రోజులకు ఓ కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు జన సైనికులు.
ఎందుకంటే ఇన్ని రోజులు ఇతర విషయాల మీద చాలా లేటుగా స్టాండ్ తీసుకునే వారు.
కానీ ఏపీలో ఇప్పుడు నిరుద్యోగుల సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి.
నోటిఫకేషన్లు రాక దాదాపు 30లక్షల మంది ఎదురు చూస్తున్నారు.వారందరి తరఫున పవన్ పోరాడితే గనక వారి మద్దతు ఆటోమేటిక్ గా పవన్‌కే ఉంటుంది.
యూత్ సపోర్టు ఉంటే ఏ పార్టీకి అయినా తిరుగుండదు.ఈ విషయం పవన్‌కు తెలియంది కాదు.
అందుకే ఆయన నేరుగా వారి తరఫున రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.ఇన్ని రోజులకు ఆయన ఓ పర్టిక్యులర్ సెక్షన్ తరఫున నిలబడ్డారని అంటున్నారు.
పవన్ ఇప్పుడు ఏపీలోని విపక్ష నయాకుల్లో ఓ అడుగు ముందంజలో ఉన్నారు.
కాగా ఇప్పుడు ఏపీలో పవన్ కు మామూలుగానే యూత్ లో మంచి క్రేజ్ ఉంది.ఇప్పుడు వారి తరఫున పోరాడితే అందరూ ఆయన్ను ఓన్ చేసుకుంటారు.ఇది పవన్‌కు కలిసి వచ్చే అంశమనే చెప్పుకోవాలి.
పైగా పవన్ ఇప్పుడు జగన్ మీద వేస్తున్న పంచులు కూడా బాగానే పేలుతున్నాయి.కాబట్టి ఈజీగానే యువతలో పవన్‌కు ఆదరణ పెరిగిపోతోంది.
ఇలాగే వారి తరఫున ఆయన ఇంకో అడుగు ముందుకు వేసి పోరాడితే మాత్రం ఆయకు తిరుగుండదని అంటున్నారు నిపుణులు.మరి పవన్ ఈ అవకాశాన్ని అదిపుచ్చుకుంటారా లేదా అన్నది చూడాలి.