ఫిబ్రవరి 9వ తేదీన అంటే ఈరోజు భారత్‌లో చాలా స్మార్ట్ ఫోన్లు అదిరిపోయే ఫీచర్లతో లాంచ్ కాబోతున్నాయి.ఇవన్నీ కూడా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న ధరలతోనే లాంచ్ కానున్నాయి.
ముఖ్యంగా మొబైల్ ప్రియులను ఆకట్టుకునే రెడ్‌మీ బ్రాండ్ నుంచి రెడ్‌మీ నోట్ 11 సిరీస్‌లో రెండు ఫోన్లు విడుదల కానున్నాయి.అంతేకాదు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో నుంచి న్యూ సిరీస్ ఫోన్లు భారత్‌లో నేడు లాంచ్ కానున్నాయి.
అలాగే శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ను విడుదల చేస్తోంది.మరి ఈ మొబైల్ ఫోన్ల ఫీచర్లు, ధరలు ఇప్పుడు చూద్దాం.
1.రెడ్‌మీ నోట్ 11
ఇండియాలో ఫిబ్రవరి 9న మధ్యాహ్నం సమయంలో రెడ్‌మీ నోట్ 11 (Redmi Note 11) స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది.ఇది స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది.ఈ ఫోన్ లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అందించారు.రెడ్‌మీ నోట్ 11 సిరీస్ లాంచ్ ఈవెంట్ షియోమీ అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాల వేదిక లైవ్ స్ట్రీమ్ అవుతుంది.రూ.13,999 ప్రారంభ ధరతో ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
2.రెడ్‌మీ నోట్ 11ఎస్
రెడ్‌మీ నోట్ 11ఎస్ (Redmi Note 11S) ఫోన్ ఫిబ్రవరి 9 మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌లో విడుదల అవుతుంది.ఈ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్ సాయంతో పనిచేస్తుంది.ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే, 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.ఇది రూ.18,999 స్టార్టింగ్ ప్రైజ్ తో లాంచ్ అయ్యే అవకాశాలున్నాయి.
3.వివో టీ1 5జీ
భారత్‌లో వివో టీ1 5జీ (Vivo T1 5G) ఫోన్‌ను ఫిబ్రవరి 9న లాంచ్ చేయడానికి రెడీ అయ్యింది వివో కంపెనీ.ఈ బడ్జెట్ మొబైల్‌లో స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్, 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే, వెనుక 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో అందించనున్నారని టాక్.దీని స్టార్టింగ్ ప్రైజ్ రూ.20 వేలలోపే ఉండొచ్చని తెలుస్తోంది.
4.శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్
ఫిబ్రవరి 9న జరిగే శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2022 ఈవెంట్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎస్22+, గెలాక్సీ ఎస్22 అల్ట్రా అనే శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ఫ్లాగ్‌షిప్ సిరీస్ (Samsung Galaxy S22 Series) ఫోన్లు లాంచ్ కానున్నాయి.ఇవి రూ.70,000 స్టార్టింగ్ ట్యాగ్ తో అందుబాటులోకి రావచ్చు.అయితే ఇవన్నీ కూడా ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్లతో రానున్నాయి.