రాజీయాల్లో ఒడిదుడుకులు సహజం.ఒక్కోసారి సొంత పార్టీ నేతల మధ్యే విభేదాలు తలెత్తుతాయి.
ఈ విషయంలో అధినేతలు వారి సహచరుల మాటలనే నమ్ముతుంటారు.వారి మాయమాటలనే నమ్మి నిర్ణయాలు కూడా తీసేసుకుంటారు.
ఇదే కోవలోకి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వచ్చినట్టు స్పష్టంగా కనబడుతోంది.అన్ని సామర్థ్యాలు ఉండి ఎన్నికల్లో గెలవగల సత్తా ఉన్నవాళ్లను సైతం పక్కన పెడుతున్నారు.
ఇదే పార్టీ వర్గాల్లో చర్చణీయాంశంగా మారుతోంది.చెప్పుడు మాటలు విని ఊరెళ్లి వచ్చే సరికి ఇళ్లు గుళ్లయిందనే సామెత మనం వింటుంటాం.
ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి కూడా అలానే ఉన్నట్టుంది.కొందరు నేతల చెప్పిన మాటలే విని ముందుకుసాగుతండడంతో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ సమస్యలు ఎదుర్కుంటున్న పరిస్థితి నెలకొంది.
ప్రధానంగా అనంతపురం జిల్లాలో కొందరి నాయకుల మాటలకే పరిమితమవుతున్నారని పార్టీ వర్గాలే ఆరోపిస్తున్నారు.గత ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గం నుంచి బండారు శ్రావణి పోటీ చేసి ఓటమి చవిచూశారు.
ఇక్కడ వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి చేతిలో శ్రావణి ఓడిపోయిన విషయం తెలిసిందే.అప్పటినుంచి ఆమె టీడీపీ శింగనమల ఇన్‌చార్జీగా కొనసాగుతున్నారు.
కానీ, ఆమె నాయకత్వాన్ని ఒక వర్గం నేతలు విభేదించడం సమస్యలకు తావిస్తోంది.అగ్ర కులానికి చెందిన ఆమె ఉంటే తాము పనిచేయమంటూ పసుపుదళం బాస్ చంద్రబాబుకు బహిరంగంగానే చెప్పేస్తున్నారు.
దీంతో స్థానిక టీడీపీ సమస్యలతో కొట్టుమిడాతోంద.దీనిని పరిష్కరించేందుకు సీనియర్ నేతలతో టూమెన్ కమిటీ నియమించారు.నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలను కూడా ఈ కమిటీకే అప్పజెప్పారు.ఈ నేపథ్యంలోనే బాబు కుమారుడు, టీడీపీ నేత నారా లోకేష్‌ను శ్రావణి కలిసి చర్చించినా ఫలితం లేకుండా పోయింది.
చేసేదేమీ లేక ఆమె కూడా అంటిముట్టనట్టు వ్యవహరిస్తోంది.శింగమనలో ఆమె జేసీ దివాకర్ రెడ్డి వర్గీయుల సహకారంతోనే రాకీయ ఆరంగ్రేట్రం చేశారు.అందుకనే ఆమెను పక్కనపెట్టినట్టు పలువురు పేర్కొంటున్నారు.జేసీ కుటుంబాన్ని కేవలం తాడిపత్రి, అనంతపురం ఎంపీ స్థానాలకే పరిమితం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని, అందుకే ఆమెను పట్టించుకోకుండా పార్టీకి దూరం పెడుతున్నారని సమాచారం.
ఇదంతా చూస్తుంటే వచ్చే ఎన్నికల వరకు కొత్త నాయకులకు అవకాశం కల్పించాలనే యోచనలో బాబు ఉన్నట్టు తెలుస్తోంది.ఏది ఏమైనా యువ మహిళా నేత శ్రావణి రాజకీయ భవితవ్యం ఒక్క ఎన్నకతో కనుమరుగయ్యే పరిస్థితి రావడం గమనార్హం.