మనిషి ప్రాణం తీసిందని చేపపై ఏకంగా పోలీసులు హత్యా కేసు పెట్టారు.ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు.
ఇది వినేందుకు వింతగా ఉన్నా మనిషి ప్రాణం తీసింది చేపే.ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖప్టణం జిల్లాలో చోటుచేసుకుంది.
సాధారణంగా చేపల వేట కోసం మత్సకారులు నదులు, సముద్రాల్లోకి వెళ్తుంటారు.ఇదేరీతిలో ఓ మత్స్యకారుడు సముద్ర తీరం నుంచి 80 నాటికల్‌మైళ్ల దూరం వెళ్లాడు.
ఈ్రకమంలో ఓ చేప ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది.దాని బారీ నుంచి తప్పించుకునేందుకు యత్నించినా అది వదలలేదు.
ఇక్కడ విచిత్రమేమిటంటే చేపను వేటాడాల్సిన మత్స్యకారుడిని చేపే వేటాడడం.ఈ ఘటనలో మత్స్యకారుడు ప్రాణం ఒదిలాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు చేపపై కేసు నమోదు చేసి ఇలాంటి చాపలు సముద్రంలో అనేకం ఉన్నాయని తెలపడం గమనార్హం.అయితే చనిపోయిన వ్యక్తి పరవాడ ముత్యాలమ్మపాళెంకు చెందిన జోగన్నగా పోలీసులు గుర్తించారు.
మృతుడితోపాటు చేపల వేటకు వెళ్లిన వారి వివరాలు కూడా సేకరించారు.గత మంగళవారం వారందరూ సముద్రంలోకి చేపలవేటకు వెళ్లగా చేపలు పడ్డాయి.వల బరువుగా ఉండి ఎంతకీ రాలేదు.దీంతో నీటిలోకి దిగి లాగేందుకు ప్రయత్నం చేశారు.
వల బోటుకు తట్టుకున్నదనుకున్న జోగన్న దానని తప్పించేందుకు యత్నించాడు.ఈ క్రమంలోనే ఓ చేప జోగన్నపై దాడికి పాల్పడింది.
ఈ ఘటనలో జోగన్న కడుపుకు గాయమై ఊపిరాడక చనిపోయాడని సహచరులు చెప్పారు.దీంతో పోలీసులు చేపపై కేసు నమోదు చేసి జోగన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు.
కాగా రిపోర్టులో చేపదాడి చేయడంతోనే చనిపోయినట్టు తేలింది.దీంతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
చేపపై అధికారుల తదుపరి చర్యలు ఏంటనేది ప్రశ్నార్థకంగా మారడం గమనార్హం. కాగా ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.