మేకపిల్లపై కుక్క ప్రేమ.. డబ్బా పట్టుకుని మరీ పాలు తాగించింది..

అప్పుడప్పుడూ అనిపిస్తుంది మనుషుల్లో కంటే జంతువుల్లోనే జాలీ, కరుణ, దయ ఎక్కువగా ఉన్నాయని.ఇందుకు నిదర్శనమైన వీడియోలు చాలానే ఉన్నాయి.

 Dog Love On Kid Holding Can And Drinking Too Much Milk Dog Love, Viral Video-TeluguStop.com

ఎదుటి జంతువు ప్రమాదంలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా మరో జంతువు తమ జాతి భేదాలు మర్చిపోయి వాటికి సహాయపడుతూ ఉంటాయి.కానీ మనుషుల్లో మాత్రం చాలా మంది తమ స్వార్థప్రయోజనాల కోసమే ఎక్కువగా ఆలోచిస్తుంటాడు.

వాటి కోసం ఎదుటి వారు ఇబ్బందులు పడినా పట్టించుకోరు.తమ పని జరగడం ముఖ్యమని కోరుకుంటారు.

కానీ ఒక కుక్క ఎదుటి జీవిపై తనకు ఉన్న ప్రేమను చాటుకుంది.

ఎదురుగా ఉన్న జీవి కుక్క పిల్ల అనుకుంటే పొరపాటే.

అదొక మేకపిల్ల.నిజమేనండి.ఆ మేకపిల్లకు కుక్క పాల డబ్బాతో పాలు తాగిస్తూ.తన గొప్పతనాన్ని అందరికీ తెలియజేసింది.మానవులు సైతం ఇలా ఎదుటి వారికి సహాయపడాలనే నీతిని ఆ కుక్క చెప్పకనే చెప్పింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీనిని చూసిన నెటిజన్స్ కుక్క చేసిన పనికి ఫిదా అవుతున్నారు.

పాపం ఒక మేకపిల్ల చాలా ఆకలితో ఇబ్బంది పడుతున్నట్టుంది.దానిని చూసిన కుక్క చలించిపోయింది.ఏకంగా పిల్లలకు పట్టే పాల డబ్బాతో ఆ మేకపిల్లకు పాలు పట్టింది.

మేక పిల్లకు ఆ డబ్బా అందేలా కుక్క కూర్చుంది.ఇక ఆ మేక పిల్ల డబ్బా పాలను తాగుతూ ఉంది.

ఇంతలో చివర్లో మరో మేక పిల్ల వచ్చింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దీనిని చూసిన నెటిజన్స్ కుక్క చూపిస్తున్న ప్రేమను అభినందించకుండా ఉండలేకపోతున్నారు.కుక్కను పొగుడుతూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కెయ్యండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube