ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’కు ఎవరూ ఊహించనంత ఆదరణ లభిస్తోంది.ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.
దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ ఫిల్మ్ ను విశేషంగా ఆదరిస్తున్నారు.ఇక ఈ చిత్రంలో మేనరిజమ్స్, సాంగ్స్, డైలాగ్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
సోషల్ మీడియాలో ‘పుష్ప’రాజ్ ట్రెండ్ సెట్టర్ అయిపోయాడని చెప్పొచ్చు.‘పుష్ప’రాజ్ మేనరిజమ్స్ రీల్స్ ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్,… ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి.
ఇండియన్ క్రికెటర్స్ మాత్రమే కాదు విదేశీ క్రికెటర్లు సైతం ‘పుష్ప’ మేనరిజమ్స్ తో ఇన్ స్టా రీల్స్ చేస్తున్నారు.అలా ఈ సినిమాకు ఇంటర్నేషనల్ క్రేజ్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
సెలబ్రిటీలు మాత్రమే కాకుండా సామాన్యులు కూడా ఈ స్టెప్స్ ను రీ క్రియేట్ చేస్తున్నారు.తాజాగా ఓ ఎయిర్ హోస్టెస్ ‘పుష్ప’ పిక్చర్ లోని ‘శ్రీవల్లి’ సాంగ్ కు చిందులేసింది.
అలా ఎయిర్ హోస్టెస్ అందంగా పాటకు స్టెప్పులేసింది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాదిరిగా హుక్ స్టెప్ వేసింది.
అలా కాలు నుంచి చెప్పు దూరం కావడం యాజ్ ఇట్ ఈజ్ గా చేసే ప్రయత్నం అయితే ఎయిర్ హోస్టెస్ చేసింది.ఇందుకు సంబంధించిన వీడియోను ఆ ఎయిర్ హోస్టెస్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది.
అది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఇక ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
‘ఎయిర్ హోస్టెస్ బాగానే ట్రై చేసిందని’ అంటున్నారు.ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఫిల్మ్.
నార్త్ ఇండియాలోనూ విశేష ఆదరణ పొందుతోంది.బీ టౌన్ సెలబ్రిటీలు, ప్రముఖులు కూడా ఈ చిత్రాన్ని చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇకపోతే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తోంది.