బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మేల్ యాంకర్లలో యాంకర్ రవి ఒకరు.ఈయన బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లకముందు ఎంతో మంచి క్రేజ్ దక్కించుకున్నారు.
అయితే బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రవి ఎంతో నెగిటివిటీని మూట కట్టుకున్నారని చెప్పవచ్చు.అందుకు గల కారణం ఈయన అబద్ధాలు చెప్పడమే కాకుండా ఒకరి దగ్గర ఒకలా మరొకరి దగ్గర మరోలా మాట్లాడుతూ పెద్ద ఎత్తున నెగిటివిటీని సంపాదించుకున్నారు.
ఈ విధంగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయన తన ఫ్యామిలీ గురించి నెగిటివ్ కామెంట్లు చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి కొద్దిరోజులపాటు సోషల్ మీడియాలో నానా హంగామా చేశారు.ఇక ప్రస్తుతం రవి హ్యాపీడేస్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.చాలా రోజుల తర్వాత రవి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
ఈ సందర్భంగా కొందరు రవిని ప్రశ్నలడుగుతూ మీరు నెలకు ఎంత సంపాదిస్తారు అంటూ తన వ్యక్తిగత విషయాల గురించి ఆరా తీశారు.
ఈ ప్రశ్నకు రవి నా కుటుంబాన్ని పోషించుకునే అంతా సంపాదించుకుంటున్నాను అంటూ తెలివిగా సమాధానం చెప్పారు.మరొక నెటిజన్ అయితే ఏకంగా మిమ్మల్ని చూస్తే ఫేక్ అనే ఫీలింగ్ కలుగుతుందని చెప్పడంతో ఈ ప్రశ్నకు రవి కూడా ఎంతో అద్భుతమైన సమాధానం చెప్పారు.అది మీ అభిప్రాయం దాని పట్ల నాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు.
ఇలా మీరు ఒకరిని జడ్జ్ చేస్తున్నారంటే వాళ్లే వీక్ పర్సన్… జనాలు నన్ను హీరో అన్నా… జీరో అన్నా నేను ఎప్పుడూ ఒకే విధంగా ఉన్నాను అంటూ రవి చాలా కూల్ గా సమాధానం చెప్పారు.