రోజూ బోర్లా ప‌డుకుంటున్నారా..? అయితే మీరివి తెలుసుకోపోతే చాలా డేంజ‌ర్‌!

సాధార‌ణంగా నిద్ర పోయే స‌మ‌యంలో ఒక్కొక్క‌రు ఒక్కో పొజీష‌న్‌లో ప‌డుకుంటారు.అయితే పిల్లలు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మందికి బొక్క బోర్లా ప‌డుకునే అల‌వాటు ఉంటుంది.

 Side Effects Of Sleeping On Your Stomach! Sleeping On Your Stomach, Bad Sleeping-TeluguStop.com

కానీ, ఇక్క‌డ తెలుసుకోవాల్సిన విష‌యం ఏంటంటే.బోర్లా ప‌డుకోవ‌డం చాలా డేంజ‌ర్‌.

ప్ర‌తి రోజు బొక్క‌బోర్లా నిద్రించ‌డం వ‌ల్ల అనేక స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేయాల్సి ఉంటుంద‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం బోర్లా ఎందుకు ప‌డుకోకూడ‌దు.? అస‌లు ఆ పొజీష‌న్‌లో ప‌డుకుంటే ఏం అవుతుంది.? వంటి విష‌యాల‌ను తెలుసుకుందాం ప‌దండీ.

బొక్క బోర్లా నిద్రించ‌డం వ‌ల్ల ముఖ చ‌ర్మం తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంది.బోర్లా ప‌డుకున్న‌ప్పుడు ముఖంపై ఉండే తేమ మొత్తాన్ని దిండు యొక్క క‌వ‌ర్ పీల్చేసుకుంటుంది.దాంతో చ‌ర్మం త‌ర‌చూ పొడి బారిపోయి ఎండిన‌ట్టు అయిపోతుంది.అలాగే ఎప్ప‌టిక‌ప్పుడు మార్చినా దిండు పై భాగంలో ఎంతోకొంత దుమ్ము ప‌డుతూనే ఉంటుంది.

అయితే బోర్లా ప‌డుకున్న‌ప్పుడు ఆ డ‌స్ట్ అంతా చ‌ర్మానికి ప‌ట్టిస్తుంది.ఫ‌లితంగా ముడ‌త‌లు, మొటిమ‌లు వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి.

బోర్లా పడుకుని నిద్రించ‌డం వ‌ల్ల జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ప‌డుతుంది.దాంతో క‌డుపు నొప్పి, అజీర్తి, క‌డుపు ఉబ్బ‌రం వంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేయాల్సి ఉంటుంది.బోర్లా నిద్రించేట‌ప్పుడు త‌ల‌ను ఒక‌వైపుకు తిప్పుకుంటారు.అయితే ఈ స్థితిలో నిద్ర పోవడం వల్ల దీర్ఘకాలిక మెడ సమస్యలు వ‌చ్చే ప్ర‌మాదం ఉంటుంది.క‌డుపు నొప్పి, అజీర్తి, క‌డుపు ఉబ్బ‌రం

అంతే కాదు, బొక్క బోర్లా ప‌డుకోవ‌డం వ‌ల్ల ఛాతీ నొప్పి, వెన్ను నొప్పి వంటి వాటితో కూడా త‌ర‌చూ ఇబ్బంది ప‌డాల్సి ఉంటుంది.అందు వ‌ల్ల‌నే ఇక‌పై పొర‌పాటున కూడా బోర్లా ప‌డుకోవ‌ద్దు.

బోర్లా పడుకునే అల‌వాటు ఉంటే గ‌నుక‌.దాన్ని నెమ్మ‌దిగా వ‌దిలించేసుకోండి.అదే మీకు, మీ ఆరోగ్యానికి మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube