లాస్ ఏంజిల్స్‌: పార్టీ మధ్యలో గర్జించిన తుపాకీ.. నలుగురు మృతి

అన్ని రంగాల్లో నెంబర్‌వన్‌గా దూసుకెళ్తున్న అగ్రరాజ్యం అమెరికా .దేశంలో నానాటికీ పెరుగుతున్న గన్ కల్చర్‌‌కు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతోంది.

 Shooting At A House Party Near Los Angeles Kills 4, Injures 1 , Edward Vincent J-TeluguStop.com

నగదు, నగలు కోసం హత్యలు చేసేవారు కొందరైతే.జాతి, వర్ణ వివక్షలతో ఉన్మాదులుగా మారేవారు మరికొందరు.

ఏది ఏమైనా అక్కడ గన్ కల్చర్ వల్ల ఏటా వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.దీనికి చెక్ పెట్టాలని ప్రభుత్వాలు కృషి చేస్తున్నా.

శక్తివంతమైన గన్ లాబీ ఈ ప్రయత్నాలను అడ్డుకుంటోందన్న వాదనలు వున్నాయి.ఇక తుపాకీ కాల్పుల్లో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు.

తాజాగా అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి.దేశంలో రెండో అతిపెద్ద నగరం, కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్‌ ఏంజెల్స్‌లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు.ఈ ఘటనలో నలుగురు మరణించగా.మరొకరు గాయపడ్డారు.

లాస్‌ ఏంజెల్స్‌కు సమీపంలో ఉన్న ఇంగ్లెవుడ్‌లోని ఓ ఇంట్లో పార్టీ జరుగుతోంది.అరుపులు, కేకలతో అంతా పార్టీని గడుపుతున్నారు.అందరూ మంచి మూడ్‌లో వుండగా ఆదివారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఆ ఇంటిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని నగర మేయర్ తెలిపారు.మూడు దశాబ్ధాల తర్వాత ఇంగ్లెవుడ్‌లో ఇదే అతిపెద్ద కాల్పుల ఘటన అని ఆయన పేర్కొన్నారు.అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ‘‘హాలీవుడ్‌’’కు నిలయమైన లాస్‌ ఏంజెల్స్‌కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంగ్లెవుడ్‌లో లక్ష మంది జనాభా నివసిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు.దుండగుల ఆచూకీ కోసం కాల్పులు చోటు చేసుకున్న ఇంటికి దగ్గరలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.

కాల్పులు జరిగిన ఇంటికి కూతవేటు దూరంలో ఎడ్వర్డ్ విన్సెంట్ జూనియర్ పార్క్, సెంటినెలా ఎలిమెంటరీ స్కూల్ వున్నాయి.ఇక్కడికి దగ్గరలోనే సోఫీ స్టేడియం వుంది.

వచ్చే వారం ఎన్ఎఫ్‌సీ ఛాంపియన్ షిప్ గేమ్, ఫిబ్రవరి 13న సూపర్‌బౌల్‌ను ఇదే స్టేడియంలో నిర్వహించనున్నారు.

Shooting At A House Party Near Los Angeles Kills 4, Injures 1 , Edward Vincent Jr. Park, Sentinel Elementary School, Gun Lobby, California, Hollywood, Indians, American Film Industry, NFC Championship Game - Telugu American, Calinia, Edward Jr Park, Gun Lobby, Hollywood, Indians, Nfcchampionship #Shorts

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube