' బాబు ' మాకొద్దు బాబోయ్ ! జనసైనికుల మాట ఇదేనా ?

జనసేన పార్టీతో పొత్తు కోసం టిడిపి ఎంతగా తహతహలాడుతోంది అనే విషయం అందరికీ అర్థమైపోయింది.స్వయంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు పొత్తు అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.

 Janasena Activists Strongly Oppose Alliance With Tdp, Chandrababu Naidu, Tdp, Cb-TeluguStop.com

తమ వైపు నుంచి పొత్తు కోసం ఎంతగా ప్రయత్నాలు చేస్తున్న ,జనసేన నుంచి స్పందన రావడం లేదనే విషయాన్ని బాబు పరోక్షంగానే ప్రస్తావించారు.కానీ కచ్చితంగా

జనసేన పార్టీ తో పొత్తు

పెట్టుకుని ముందుకు వెళితేనే 2024 ఎన్నికల్లో విజయం సాధిస్తామనే విషయాన్ని చంద్రబాబు గుర్తించారు.

ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయి అనే భయమూ చంద్రబాబు ను వెంటాడుతోంది.
  టిడిపితో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలనే ఆలోచన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో ఉన్న,  పార్టీ క్యాడర్ మాత్రం టిడిపితో పొత్తు అంశాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది.

లాభమో నష్టమో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి సత్తా చాటుకోవాలని ,జనసేన టిడిపితో కలిసి వెళ్తే లాభం కంటే జరిగే నష్టమే ఎక్కువని గతంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న మిగతా పార్టీల పరిస్థితి తర్వాత ఏ విధంగా మారింది అనే విషయాన్ని జనసైనికులు గుర్తు చేస్తున్నారు.అంతే కాదు సోషల్ మీడియాలో టిడిపితో పొత్తు అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

టిడిపి శ్రేణులు జనసేన తో పొత్తు అంశాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉండడం దానికి గట్టిగానే జనసైనికులు కౌంటర్ ఇస్తున్నారు.
 

జనసేన కిందిస్థాయి కార్యకర్తల నుంచి పవన్ అభిమానుల వరకు అంతా టిడిపికి వీలైనంత దూరంగా ఉండాలని, ఇప్పుడిప్పుడే జనసేన జనాల్లోకి బాగా వెళ్లిందని, 2024 ఎన్నికల నాటికి సరైన వ్యూహాలతో ముందుకు వెళితే జనసేన కు గౌరవప్రదమైన స్థాయిలోనే సీట్లు గెలుచుకుంటుందనే అభిప్రాయాన్ని జనసేన పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.కింది స్థాయి నుంచి ఈ రకమైన ఫీడ్ బ్యాక్ వస్తుండడంతో నే పవన్ సైతం ఈ విషయంలో సైలెంట్ గానే ఉండిపోతున్నారట.టిడిపి తరపున ఎన్ని రాయబారాలు నడుపుతున్నా, ఎంతగా పొత్తు అంశాన్ని ప్రస్తావిస్తున్నా, కిందిస్థాయి క్యాడర్ వ్యతిరేకిస్తుండడంతో పవన్ సైతం ఆలోచనలో పడ్డారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube