ఈ ఆహారాలు మీ డైట్ లో ఉంటే, రోగనిరోధకశక్తి 3 రేట్లు పెరుగుతుంది

రోగనిరోధకశక్తి, అంటే Resistance Power లేదా Immunity Power.ఇది ఒంట్లో మంచి మోతాదులో ఉంటేనే మీ శరీరంపై మీకు కంట్రోల్ ఉంటుంది.లేదంటే తుమ్మితే కూడా ఏదో ఒక సమస్య వస్తుంది.ఇప్పుడు వేసవి నడుస్తోంది, కొందరు చిన్నిపాటి ఎండకు వెళ్ళగానే, వడదెబ్బ తగిలి మంచం మీద పడతారు.రాబోయేది వర్షకాలం.ఇంఫెక్షన్స్ బెడద ఎక్కువ ఉంటుంది.

 Top Food Sources For Antioxidants And Immunity Power-TeluguStop.com

వాతావరణం లో మార్పులు చాలా సహజం.జ్వరం, జలుబు లాంటి సమస్యలు సర్వసాధారణం.

అయితే, కొందరి శరీరాలు ఎంత బలహీనంగా ఉంటాయంటే, వారిని ఒక ఇంఫెక్షన్ పట్టుకుందా అంటే అంత సులువుగా వదలదు.వారాలపాటు ఇబ్బందిపడుతూనే ఉంటారు.

మరోవైపు మరో చాలా సులువుగా కొలుకుంటాడు, లేదంటే అంత సులువుగా, జ్వరాల బారిన పడడు.ఈ తేడాలకు కారణం, రోగనిరోధకశక్తి లో ఉండే తేడాలు.మరి రోగనిరోధకశక్తి పెరగాలంటే ఏం చేయాలి? ఏం తినాలి?

Antioxidants ఉండే ఆహారపదార్ధాలు ఎక్కువగా తినాలి‌‌.యాంటిఆక్సిడెంట్స్ రోగనిరోధకశక్తి ని పెంచి, చిన్న చిన్న ఇంఫెక్షన్స్ లు మాత్రమే కాదు, క్యాన్సర్, షుగర్ లాంటి పెద్ద పెద్ద సమస్యలు కూడా శరీరాన్ని ఆక్రమించకుండా కాపాడుతాయి.మరి యాంటిఆక్సిడెంట్స్ శరీరానికి అందేదెలా? ఎలాంటి ఆహారపదార్ధాల్లో ఇవి ఎక్కువగా లభిస్తాయి?

* పాలకూరని ఇష్టపడనివారు ఉంటారా? ఉంటే మాత్రం, వెంటనే ఇష్టపడండి‌.ఎందుకంటే యాంటిఆక్సిడెంట్స్ అందించడంలో పాలకూర చాలా ఫేమస్‌.

యాంటిఆక్సిడెంట్స్ తో పాటు బెటాకెరొటిన్ కూడా ఇవ్వడం దీని ప్రత్యేకత.ఈ రెండు ఎలిమెంట్స్ యొక్క కలబోత వలన, దీన్ని యాంటి క్యాన్సర్ ఫుడ్ అని అంటారు.

అంటే క్యాన్సర్ సెల్స్ ఒంట్లో పెరగకుండా అడ్డుకుంటుంది అన్నమాట‌.అదనంగా, విటమిన్ ఏ,సి,కె, బి2 మరియు ఈ, వాటితోపాటుగా మెగ్నీషియం, ఫోలేట్, కాల్షియం, పొటాషియం, మాంగనీజ్ మరియు ఐరన్ లభ్యమవుతాయి.

తాజా పాలకూడని అలాగే తినవచ్చు.సలాడ్స్ లో తీసుకోవచ్చు.

* కొంచెం దొరకడం కష్టం ఏమో కాని, బ్లూబెరిస్ ఖచ్చితంగా మీ డైట్ లో ఉండాల్సిన ఫలం.హైదరాబాద్ వాసులకి అయితే, అబిడ్స్ లాంటి పెద్ద పెద్ద ఫ్రూట్ మార్కెట్స్ లో దొరకబట్టడం పెద్ద కష్టం ఏమి కాదు‌.ఇక ఈ ఫలం ప్రత్యేకత ఏమిటంటే, యాంటిఆక్సిడెంట్స్ అత్యధికంగా గల ఫలాల్లో ఇది ఒకటి.అందులోనూ, anthocyanins అనే రకం బ్లూబేరిస్ ఇంకా మంచివి‌.విటమిన్ సి, కె, మ్యాంగనీజ్, మెగ్నీషియం, కాపర్, ఐరన్, జింక్, నియాసిన్, ఫైబర్, ఫోలేట్, పొటాషియం, ఇలా అన్నిరకాల మినరల్స్ ఉండే బ్లూబెరిస్ మీ రోగనిరోధకశక్తి ని అమాంతంగా పెంచేస్తాయి.రోజుకి ఒక అరకప్ తినండి చాలు, యాంటిఆక్సిడెంట్స్ కోసం మరో ఆహారం మీద ఆధారపడాల్సిన పని లేదు.

* న్యూట్రిషన్ నిపుణులు ఎక్కువగా రేట్ చేసే ఆకు కూరల్లో కాలే కూడా ఒకటి.Quercetin, kaempferol లాంటి అరుదైన యాంటిఆక్సిడెంట్స్ కూడా కాలేలో దొరుకుతాయి.

ఈ రెండు యాంటిఆక్సిడెంట్స్ ఎలాంటి రోగానితోనైనా పోరాడతాయి.ఇంతేకాకుండా, కాలేలో విటమిన్ ఏ, బి, సి, కె, తోపాటు ఫైబర్, కాల్షియం, కాపర్, మాంగనీస్, పొటాషియం, కాపర్ ఉంటాయి.

ఇక ప్లాంట్ ప్రొటీన్ అలాగే ఒమెగా 3 ఫ్యాటి ఆసిడ్స్ అదనపు బెనిఫిట్లు.
* స్ట్రాబెర్రీలు అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే కాని, ఆరోగ్యం ముఖ్యం అనుకుంటే మాత్రం లెక్కలెనన్ని లాభాలు చేకూరుస్తుంది ఈ ఫలం.చిన్నగా ఉండే ఈ ఫలం ఎంత శక్తివంతమైనది అంటే, దీనిలో ఉండే anthocyanins అనే యాంటిఆక్సిడెంట్స్ ఏకంగా గుండె జబ్బుతో పోరడతాయి.రెగ్యులర్ గా తింటే, గుండె జబ్బును అసలు రాకుండా అడ్డుకోవచ్చు.

ఇందులో కూడా విటమిన్ సి తో పాటు, కె, బి, ఫైబర్, కాపర్, మాంగనీజ్, పొటాషియం, బయోటిన్, ఒమేగా ఫ్యాటి అసిడ్స్, ఫొలేట్, మెగ్నీషియం తదితర విటమిన్స్, మినరల్స్ మరియు ఆసిడ్స్ లభ్యం అవుతాయి.రోజుకి ఓ కప్పులో స్ట్రాబెర్రీ తినండి, మీరు ఎంత ఆరోగ్యంగా తయారవుతారో మీరే చూడండి.

ఇతర ఆహార పదార్థాలు :

* డార్క్ చాకొలేట్ ఎప్పుడైనా తిన్నారా? కాకాఓ చెట్టు నుంచి స్వచ్ఛమైన డార్క్ చాకోలేట్ తినండి.మీ రోగనిరోధకశక్తి అమాంతం పెరుగుతుంది.

* బీట్ రూట్స్ లో కూడా యాంటిఆక్సిడెంట్స్ విపరీతంగా లభిస్తాయి.ఇందులో ఉండే మినరల్స్ మరింత బలాన్ని ఇస్తాయి.

* కిడ్నీ బీన్స్ లో చాలా ఎక్కువ మోతాదు లో యాంటిఆక్సిడెంట్స్ ఉంటాయి.రెడ్ బీన్స్, పింటో బీన్స్ లోనూ అంతే, చాలా ఎక్కువగా ఉంటాయి యాంటిఆక్సిడెంట్స్.

* మన దేశంలో మరో అరుదైన ఫలం, అవకాడో కూడా యాంటిఆక్సిడెంట్స్ తో నిండి ఉంటుంది.ఖర్చు ఎక్కువ, ఆరోగ్యం కూడా ఎక్కువే.

* ఇంకా చెప్పాలంటే, గోజి బెర్రిస్, వైల్డ్ బెర్రిస్, ఎల్డర్ బెర్రిస్, క్రాన్బెర్రిస్, ఆర్టి చోక్ తదితర ఆహారపదార్ధాల్లో రోగనిరోధకశక్తి ని పెంచే యాంటిఆక్సిడెంట్స్ పుష్కలంగా దొరుకుతాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube