తగ్గేదే లేదంటున్న రేవంత్ ! చేరికలు సభ్యత్వాలతో ..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఇబ్బందికర ఎదుర్కొంటున్నారు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.ముఖ్యంగా సీనియర్ నాయకులు నుంచి తనకు సరైన సహకారం అందకపోయినా, తన పోరాటం మాత్రం ఆపేది లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

 Rewanth Redd The Telangana Congress President Focused On Party Affiliation And-TeluguStop.com

టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో కాంగ్రెస్ కొంతకాలం క్రితం వరకు ఉన్నా,  ఇప్పుడు ఆ స్థానాన్ని బిజెపి ఆక్రమించింది.  రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ , టీఆర్ఎస్ మధ్య పోటీ వాతావరణం నెలకొనడంతో రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు.

కాంగ్రెస్ లో నూతన ఉత్సాహం తీసుకువచ్చేందుకు పెద్ద ఎత్తున చేరి కలను ప్రోత్సహించడంతో పాటు,  సభ్యత్వ నమోదు పైన రేవంత్ రెడ్డి దృష్టిసారించారు.
      ఈ మేరకు బిజెపి టిఆర్ఎస్ లో ఉన్న నాయకులను కాంగ్రెస్ లోకి తీసుకు వచ్చేందుకు రేవంత్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు .ఇప్పటికి ఎంతో మంది నాయకులు రేవంత్ సారధ్యంలో కాంగ్రెస్ లో చేరారు.తాజాగా  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాంతం నుంచే ఈ చేరికల ను రేవంత్ మొదలుపెట్టారు.

జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఈ జిల్లా నుంచి దాదాపు 300 మంది కాంగ్రెస్ లో చేరారు.దీంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా పెద్దఎత్తున డిజిటల్ సభ్యత్వ నమోదు చేయించాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. 
   

  పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు,  ఆందోళనలు చేపడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై మరింత ఒత్తిడి పెంచాలని , రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు బాటలు వేయాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.కాంగ్రెస్ సీనియర్ నాయకులు నుంచి తనదైన శైలిలో ముందుకు తీసుకువెళ్లాలని డిసైడ్ అయినట్టు గా కనిపిస్తున్నారు.చేరికలు,  సభ్యత్వాల తో పాటు,  నిత్యం కాంగ్రెస్ శ్రేణులు జనంలోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేసే విధంగా రేవంత్ రూపకల్పన చేస్తున్నారు.ఇక కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత తాను కూడా తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించాలనే వ్యూహంలో రేవంత్ఉన్నట్టు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube