రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరూ చెప్పలేరు.ఎందుకంటే తమ రాజకీయ భవిష్యత్తు కోసం నాయకులు పార్టీలు మారడం సహజం.
ఇక ఎన్నికల సమీపిస్తున్నాయంటే చాలా మంది పార్టీలు మారేందుకు రెడీ అయిపోతారు.టికెట్ దక్కలేదని ఒకరు, పార్టీపై అసంతృప్తితో మరొకరు ఇలా జంప్ అవుతూనే ఉంటారు.
ఇలాంటి సమయంలో ఎవరినీ తప్పుబట్టాల్సిన అవసరం లేదు.ఎవరి ఆలోచన విధానాలు వారివి.
ఇలాగే ఏపీలోని ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న ఓ సీనియర్ నేత సైతం పార్టీ మారెందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని టాక్.ఇంతకీ ఆయన ఎవరని అనుకుంటున్నారా? మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్.2014 రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ లో కొనసాగిన ఆయన ఆ తర్వాత టీడీపీలోకి చేరారు.తర్వాత రాజ్యసభ స్థానం సొంతం చేసుకున్నారు.2019 ఎలక్షన్స్ తర్వాత బీజేపీలోకి జంప్ అయ్యారు.ఇక మరో ఆరునెలల్లో ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగియనుంది.
ఆ తర్వాత ఆయన టీడీపీ పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతానికి ఆయన కుమారుడు టీజీ భరత్ టీడీపీలోనే కొనసాగుతున్నారు.
కర్నూల్ టౌన్ ఇన్ చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.ఇక వచ్చే ఎలక్షన్స్‌లో భరత్ కు టీడీపీ తరపున దాదాపుగా టికెట్ కన్ఫార్మ్ అయినట్టేనని టాక్.
ఇక కొడుకు గెలుపుకోసం వెంకటేశ్.బీజేపీని వీడి టీడీపీలో చేరతారని ప్రచారం సాగుతోంది.
మరో వైపు జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఇక బీజేపీతో కలిసి పనిచేయడం అనుమానమనే చెప్పాలి.దీంతో వెంకటేశ్ టీడీపీలో చేరేందుకు మొగ్గుచూపుతున్నారట.
మరి ఆయన టీడీపీలో చేరితే పార్టీకి కొంత బలం చేకూరడంతో పాటు ఆయన రాజకీయ భవిష్యత్తు సైతం సాఫీగా సాగుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.మరి ఆయన నిజంగానే టీడీపీలో చేరతారా అంటే వేచి చూడక తప్పదు మరి.