ఒళ్లు నొప్పులు.తరచూ ఇబ్బంది పెట్టే కామన్ సమస్యల్లో ఇది ఒకటి.
విశ్రాంతి లేకుండా పని చేయడం, జ్వరం సోకినప్పుడు, గంటలు తరబడి వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, పోషకాల కొరత, ఎక్కువ సమయం పాటు ఒకే చోట కూర్చొని ఉండటం ఇలా రకరకాల కారణాల వల్ల ఒళ్లంతా నొప్పులు పుడుతుంటాయి.అటువంటి సమయంలో దాదాపు చాలా మంది చేసే పని మెడికల్ షాప్‌కి వెళ్లి పెయిన్ కిల్లర్స్ తెచ్చుకుని వేసేసుకోవడం.
కానీ, పెయిన్ కిల్లర్స్ తాత్కాలికంగా నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందించినా.ధీర్ఘకాలికంగా మాత్రం ఎన్నో సమస్యలను తెచ్చిపెడతాయి.
అందుకే ఇటు వంటి సమస్యలను సహజ పద్ధతుల్లోనే తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.అయితే ఒళ్లు నొప్పులను తగ్గించడంలో `వావిలాకు` ఒక న్యాచురల్ పెయిన్ కిల్లర్‌లాగా పని చేస్తుంది.
పల్లెటూర్లలో విరి విరిగా దొరికే వావిలాకులో ఎన్నో ఔషధ గుణాలు నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్య పరంగా వావిలాకు అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.
ముఖ్యంగా ఒళ్లు నొప్పులతో బాధ పడే వారు.స్నానం చేసే నీటిలో గుప్పెడు వావిలి ఆకులు వేసి మరిగించి అప్పుడు ఆ నీటితో స్నానం చేయాలి.
ఇలా చేస్తే ఒళ్లు నొప్పులు ఇట్టే దూరం అవుతాయి.లేదా ఒక కప్పు వావిలి ఆకులు తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి రసాన్ని వేరు చేయాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో కప్పు ఆవ నూనె, వావిలాకు రసం వేసి బాగా మరిగించాలి.ఆపై ఈ నూనెను గోరు వెచ్చగా అయిన తర్వాత శరీరం మొత్తానికి పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే ఒళ్లు నొప్పులే కాకుండా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు సైతం పరార్ అవుతాయి.
ఇక తల నొప్పిని నివారించడంలోనూ వావిలాకు సహాయపడుతుంది.కొన్ని వావిలి ఆకులను మెత్తగా నూరి నుదురుపై ఐదు నుంచి పది నిమిషాల పాటు పెట్టుకోవాలి.ఇలా చేస్తే తల నొప్పి క్షణాల్లో మాయం అవుతుంది.