కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రులలో సమస్యలు అంతకంతకూ పెరుగుతున్నాయి.రాజధానిలో 40కిపైగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి.
వీటిలో 17 ఆసుపత్రులలో రెండు వేల మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలు కరోనా ఇన్‌ఫెక్షన్ బారినపడ్డారు.ఢిల్లీలో 1200 మంది వైద్యులు, 700 మంది నర్సులు, 400 మంది పారామెడికల్ సిబ్బందికి కరోనా సోకినట్లు వెల్లడయ్యింది.2300 మంది ఆరోగ్య కార్యకర్తలు హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నారు.ఢిల్లీ ఎయిమ్స్‌లోని 80 మందికి పైగా ఫ్యాకల్టీ, రెసిడెంట్ డాక్టర్లతో సహా 430 మంది ఆరోగ్య కార్యకర్తలు కరోనా బారిన పడ్డారు.
వీరిలో 35 మంది ఆరోగ్య కార్యకర్తలు స్వల్ప లక్షణాలతో ఎయిమ్స్‌లోని కొత్త ప్రైవేట్ వార్డులో చేరారు.కాగా బాధిత ఆరోగ్య కార్యకర్తల అధికారిక డేటా రాష్ట్ర స్థాయిలో అందుబాటులో లేదని ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు.
న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీలో 40 శాతానికి పైగా సిబ్బందికి వ్యాధి సోకింది.అదేవిధంగా, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ మనీష్ మాట్లాడుతూ ఇక్కడ సిబ్బంది, అధ్యాపకులలో సుమారు 35 శాతం మందికి కరోనా సోకిందని తెలిపారు.
సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఇప్పటివరకు 200 మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలు వైరస్ బారిన పడ్డారు.వీరిలో 95 మంది వైద్యులు ఉన్నారు.
ఈ విషయాన్ని ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మనీష్ ధృవీకరించారు.లోక్‌నాయక్ ఆస్పత్రిలో 45, జీటీబీలో 85, అంబేద్కర్ ఆస్పత్రిలో 92, రోహిణి, హిందూరావు మెడికల్ కాలేజీలో 135, డాక్టర్ హెడ్గేవార్‌లో 40, చాచా నెహ్రూ ఆస్పత్రిలో 52, రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీలో 35 మందికి కరోనా సోకింది.