2021 వ సంవత్సరానికి గుడ్ బై చెబుతూ ఎంతో మంది సినీ తారలు ఇతర దేశాలకు వెళ్లి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.ఇలా విదేశాలలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అక్కడ దిగిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడంతో ఈ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇకపోతే కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమపక్షులుగా ఉన్నటువంటి నయనతారవిగ్నేష్ శివన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీరిద్దరు కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉంటున్న సంగతి మనకు తెలిసిందే ఇప్పటికే నిశ్చితార్థం కూడా చేసుకున్నారని,త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఈ జంట కూడా నూతన సంవత్సరానికి స్వాగతం పలకడం కోసం దుబాయ్ వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.దుబాయ్ లో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆ ఫోటోలు పెద్దఎత్తున వైరల్ గా మారాయి.నూతన సంవత్సరం తర్వాత కొన్ని రోజుల పాటు దుబాయ్ లో ఉన్న ఈ జంట అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ల చుట్టూ తిరుగుతూ వారికి కావలసిన షాపింగ్ చేస్తూ వచ్చారు.
ఇకపోతే నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా నటిమెహ్రీన్ కూడా దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే నటి మెహ్రీన్, దుబాయ్ లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ లోనటి నయనతారను కలిసినట్లు సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అలాగే నయనతార,మెహ్రీన్ తో పాటు దర్శకుడు, నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ కూడా వీరితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ ఫోటోని షేర్ చేస్తూ నటి మెహ్రీన్ “చివరికి లేడీ సూపర్ స్టార్ నయనతారను కలవడం ఎంతో సంతోషంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చారు.ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్లు ఈ ఫోటో పై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.ఇక వీరి సినిమాల విషయానికి వస్తే నయనతార ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలను చేతిలో పెట్టుకొని ఎంతో బిజీగా ఉన్నారు.
అలాగే నటి మెహ్రీన్ కూడా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎఫ్2 సినిమా సీక్వెల్ చిత్రం ఎఫ్ 3 లో నటిస్తున్న సంగతి తెలిసిందే.