సంక్రాంతికి మామ రాకున్నా అల్లుడు వచ్చేస్తున్నాడు

దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి.ముఖ్యంగా ఉత్తర భారతంలో ఈ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యం లో అక్కడ థియేటర్లు మూసేస్తున్నారు.

 Mahesh Babu Family Hero Galla Ashok Movie Hero Coming For Sankranthi, Mahesh Bab-TeluguStop.com

కొన్ని చోట్ల 50 శాతం ఆక్యుపెన్సీ పెడుతున్నారు.నైట్‌ కర్ఫ్యూ ఇలా పలు విధాలుగా అక్కడ కండీషన్స్ పెడుతున్న నేపథ్యంలో సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన పాన్ ఇండియా సినిమా లను వాయిదా వేయడం జరిగింది.

ఉత్తరాది పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడ్డ సినిమాల స్థానంలో నాలుగు అయిదు సినిమాలు రాబోతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి బాగానే ఉంది కనుక ఇబ్బంది లేకుండా సినిమాలు ఆడుతాయని భావించి పెద్ద ఎత్తున సంక్రాంతికి సినిమా లను విడుదల చేయబోతున్నారు.

అందులో మహేష్ బాబు మేనల్లుడు.ఎంపీ గల్లా జయదేవ్‌ తనయుడు గల్లా అశోక్‌ నటించిన హీరో సినిమా కూడా ఉంది.

నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా గురించి మూడేళ్లుగా ప్రచారం జరుగుతోంది.సమయం కలిసి రాకపోవడంతో కరోనా కాటు వేసి హీరో సినిమా వాయిదా పడుతూ వచ్చింది.

ఎట్టకేలకు సంక్రాంతి సీజన్ లో ఈ సినిమా కు చోటు దక్కింది.జనవరి 15న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో అంతా ఉన్నారు.

Telugu Ashok, Galla Ashok, Mahesh Babu, Nidhi Agarwal, Nidhi Agrawal, Sankranthi

ఈ సంక్రాంతికి మహేష్‌ బాబు సర్కారు వారి పాట రావాల్సి ఉంది.కాని ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా కోసం మహేష్ బాబు సైడ్‌ అయ్యాడు.ఇప్పుడు ఆర్‌ ఆర్‌ ఆర్‌ సైడ్‌ అవ్వడంతో మామ స్థానంలో అల్లుడు హీరోగా దూసుకు వస్తున్నాడు.మరి ఈ సినిమా ఫలితం ఏంటీ.మహేష్ బాబు అభిమానులకు అల్లుడు అశోక్‌ సినిమా నచ్చి.గల్లా అశోక్‌ హీరోగా నిలదొక్కుకునేనా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube