పాలు, లవంగాలు.ఈ రెండూ విడి విడిగా ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయి.ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.అనేక అనారోగ్య సమస్యలనూ నివారిస్తాయి.అయితే రెండిటినీ కలిపి అంటే పాలల్లో లవంగం పొడిని మిక్స్ చేసి తీసుకుంటే గనుక మరిన్ని ఆరోగ్య లాభాలను పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.మరి ఆ ఆరోగ్య లాభాలు ఏంటీ.? పాలల్లో లవంగం పొడిని ఎలా కలిపి తాగాలి.? ఎప్పుడు తాగాలి.? వంటి విషయాలు లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక గ్లాస్ గోరు వెచ్చగా ఉన్న పాలను తీసుకుని.అందులో రెండంటే రెండు లవంగాలను పొడి చేసి వేయండి.ఆపై రుచి కోసం కొద్దిగా నల్ల బెల్లం యాడ్ చేసి బాగా కలిపితే సరిపోతుంది.
ఈ లవంగం పాలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలోనో లేదా రాత్రి నిద్రించడానికి గంట ముందో సేవించాలి.ఇక ఈ లవంగం పాలను తాగడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో కూడా చూసేయండి.
డిప్రెషన్‌తో బాధపడే వారు ప్రతి రోజూ ఆ పాలను తీసుకోవాలి.తద్వారా అందులో పలు పోషక విలువలు బ్రెయిన్ కు ఆక్సిజన్ ప్రసరణను మెరుగ్గా మార్చి.
డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన, తల నొప్పి వంటి మానసిక సమస్యలన్నిటినీ దూరం చేస్తాయి.లవంగం పాలను తాగడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు తగ్గు ముఖం పడతాయి.
ఆస్తమా లక్షణాలు కూడా పరార్ అవుతాయి.
అలాగే ఈ చలికాలంలో చాలా మందిని మలబద్ధకం సమస్య వేధిస్తుంది.అయితే రోజూ లవంగం పాలు తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడి మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.అంతే కాదు, లవంగం పాలు తాగడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.ఎముకలు గట్టిగా బలంగా మారతాయి.
మరియు నోటి దుర్వాసన సమస్య దూరం అవుతుంది.