ఫేషియ‌ల్ హెయిర్‌ను తొలిగించే బెస్ట్ హోమ్‌మేడ్ టిప్స్ ఇవే?

ఫెషియ‌ల్ హెయిర్‌.ఆడ‌వారిని అమితంగా ఇబ్బంది పెట్టే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.

ముఖం మీద సన్నని వెంట్రుక‌లు ఉండ‌టం వ‌ల్ల చూసేందుకు చాలా అస్య‌హంగా ఉంటుంది.

అందుకే ఈ ఫెషియ‌ల్ హెయిర్‌ను తొలిగించుకునేందుకు త‌ర‌చూ బ్యూటీ పార్ల‌ర్స్ చుట్టూ తిరుగుతారు.

అయితే ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ సెకెండ్ వేవ్‌ రూపంలో విరుచుకుప‌డుతోంది.ఈ స‌మ‌యంలో బ్యూటీ పార్ల‌ర్స్‌కు వెళ్లే ప‌రిస్థితి లేదు.

దాంతో ఫేషియ‌ల్ హెయిర్ ను ఎలా రిమూవ్ చేసుకోవాలో తెలియ‌క చాలా మంది నానా తిప్ప‌లు ప‌డుతున్నారు.అయితే ఇంట్లోనే కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే.

Advertisement

సులువుగా ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.మ‌రి ఆ టిప్స్ ఏంటో చూసేయండి.

ఫేసియ‌ర్ హెయిర్‌ను రిమూవ్ చేయ‌డంలో మెంతులు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.ముందుగా ఒక బౌల్ తీసుకుని.

అందులో మెంతుల పొడి, నిమ్మ ర‌సం మ‌రియు పంచ‌దార వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ఫేషియ‌ల్ హెయిర్ ఉన్న చోట అప్లై చేసి.

ప‌ది నిమిషాల పాటు బాగా స్క్ర‌బ్ చేయాలి.ఆ త‌ర్వాత స్క్ర‌బ్బింగ్ ప్యాడ్ స‌హాయంతో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఇలా చేస్తే ఫేసియ‌ల్ హెయిర్ పోతుంది.అలాగే ఒక బౌల్‌లో ఎగ్ వైట్‌, కార్న్ ఫ్లోర్, షుగ‌ర్ మ‌రియు నిమ్మ ర‌సం వేసి బాగా క‌లిపుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని హెయిర్ ఉన్న చోట అప్లై చేసి డ్రై అవ్వ‌నివ్వాలి.అనంత‌రం కొద్దిగా వాట‌ర్ జ‌ల్లి మెల్ల మెల్ల‌గా వేళ్ల‌తో స్క్ర‌బ్ చేసుకుంటూ శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.ఒక గిన్నెలో శెన‌గ‌పిండి, చిటికెడు ప‌సుపు, రోజ్ వాట‌ర్‌ మ‌రియు పాలు పోసి మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ఫేషియ‌ల్ హెయిర్ ఉన్న చోట పూసి.బాగా ఆర‌నివ్వాలి.

ఆ త‌ర్వాత వాట‌ర్ సాయంతో స్క్ర‌బ్ చేస్తూ.ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా ఫేషియ‌ల్ హెయిర్ రిమూవ్ అవుతుంది.

తాజా వార్తలు