860 వోల్ట్స్ కరెంటు చేపను నోట కరచుకున్న మొసలి స్పాట్ డెడ్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..!

కొన్ని వన్యప్రాణులు, సముద్ర జీవులు ప్రత్యేక శక్తిని కలిగి ఉంటాయి.ఈ ప్రత్యేకమైన శక్తులతో అవి తమను తాము శత్రువుల దాడుల నుంచి రక్షించుకుంటాయి.

 860 Volts Current Crocodile Spotted By Fish. 860 Old, Currency Notes, Latest New-TeluguStop.com

అయితే అలాంటి జీవుల్లో ఎలక్ట్రిక్ ఈల్ అనే ఓ చేప చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది.ఈ చేప శరీర నిర్మాణం మిగతా చేపలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది.

ఈ చేపలో ఆరువేల కణాలు చిన్న బ్యాటరీల లాగా పనిచేస్తాయి.ఈ బ్యాటరీలతో అవి 600 నుంచి 900 వోల్టుల వరకు కరెంట్ శక్తిని ఉత్పత్తి చేయగలవు.

ఈ సహజ కరెంట్ శక్తితో అవి ఇతర చేపను వేటాడతాయి.అలాగే ఇవి తమ శత్రువులను తమ కరెంట్ శక్తితో చంపగలవు.

ఇప్పటికే చాలామంది మనుషులు దీనిని ముట్టుకొని తీవ్రమైన షాక్కు గురై నీటిలో మునిగిపోయి చనిపోయారు.అయితే తాజాగా ఒక మొసలి పొరపాటున ఎలక్ట్రిక్ ఈల్ చేపపై దాడి చేసి అక్కడికక్కడే మరణించింది.

ఈ ఘటనకు సంబంధించిన ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

వైరల్ వీడియోలో ఎలక్ట్రిక్ ఈల్ అనే పెద్ద చేపపై మొసలి దాడి చేయడానికి సన్నద్ధం అవుతున్నట్లు చూడొచ్చు.

ఒక నది నీటి ఒడ్డున ఈల్ చేప, మొసలిని మనం చూడొచ్చు.అయితే ఇది అత్యంత ప్రమాదకరమైన కరెంట్ చేప అనే విషయం తెలియక మొసలి దానిని నోట కరుచుకుంది.

మరుక్షణమే చేప బాడీ నుంచి 860 వోల్టుల కరెంటు మొసలి దవడల ద్వారా ప్రసరించడంతో అది గిలగిలా కొట్టుకుంది.నిమిషాల వ్యవధిలోనే మొసలి విగతజీవిగా మారింది.

ఆ మొసలి కళ్లు తేలేసి ఉలుకు పలుకు లేకుండా అత్యంత ఘోరమైన పరిస్థితుల్లో కనిపించింది.

అయితే ఈ మొసలి స్పాట్ డెడ్ అని వీడియో తీసిన ఫొటో గ్రాఫర్ పేర్కొన్నాడు.మొసలి దవడల కింద నలిగిపోయిన ఆ చేప కూడా చచ్చిపోయిందని వెల్లడించాడు.ఈ ఒళ్ళు గగుర్పొడిచే ఘటనకు సంబంధించిన వీడియోని ట్విట్టర్ వేదికగా షేర్ చేసి మొసలి, చేప మరణించినట్లు పేర్కొన్నాడు.

అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.ఇలాంటి అరుదైన వీడియోని షేర్ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.ఇలా ఓ భారీ మొసలి గిలగిలా కొట్టుకుని అత్యంత దారుణమైన పరిస్థితుల్లో చనిపోవడం తాము ఎప్పుడూ చూడలేదని మరికొంత మంది నెటిజన్లు పేర్కొంటున్నారు.ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube