శ్రియా శరన్ చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఒకప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈమె ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ కాస్త దూరం అయ్యింది.
ప్రస్తుతం గమనం సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది.గమనం సినిమాకు సంజనా రావు దర్శకత్వం వహిస్తోంది.
ఈ సినిమాతో సంజన రావు దర్శకురాలిగా పరిచయం కాబోతోంది.ఈ సినిమాలో శ్రియ శరన్, ప్రియాంక జవాల్కర్, శివ కందుకూరి, నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమా డిసెంబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన శ్రియా సరన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
కరోనా వల్ల సినీ ఇండస్ట్రీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమ కోలుకుంటోంది అని తెలిపింది.
అదే విధంగా నేను ఎంత వరకు బతికి ఉంటానో అప్పటివరకు సినిమాలలో నటిస్తూనే ఉంటానని తెలిపింది.నా సినిమాలు చూసి నా ఫ్యామిలీ, నా కూతురు గర్వపడే విధంగా చేయాలి అనుకుంటున్నాను అని ఆమె తెలిపింది.
ఈ పాత్ర గమనం సినిమా కథ వినగానే నా కంట్లో నీళ్లు వచ్చాయి, ఈ సినిమాలో నేను దివ్యాంగురాలుగా కనిపిస్తాను అని ఆమె తెలిపింది.ఇక షూటింగ్ సమయంలో శ్రియ శరన్ ఫ్రెండ్ చనిపోయిందని, దీనితో శ్రేయ గుండె బద్దలై పోయింది అని ఆమె తెలిపింది.ఆ బాధలోనే షూటింగ్ చేశానని, సినిమాలో ఒక రూపంలోనే ఉంటాను దాన్నుంచి బయటకు రావడమే నా విజయం.ఈ పాత్ర పోషించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది అని తెలిపింది శ్రియ శరణ్.