తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.అధికార, ప్రతిపక్షం మధ్య మాటల తూటాలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
అయితే గత రెండు సార్వత్రిక ఎన్నికల కంటే ముందు ఉన్నప్పటి రాజకీయ పరిస్థితులకు ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు చాలా తేడా ఉంది.అయితే గత రెండు సార్వత్రిక ఎన్నికల కంటే ముందు తెలంగాణలో బలమైన ప్రతిపక్షం అనేది లేని పరిస్థితి ఉంది.
కానీ ఇప్పుడు టీఆర్ఎస్ తరువాత రెండో ప్రత్యామ్నాయ స్థానం కోసం బీజేపీ పెద్ద ఎత్తున పోటీ పడుతున్న పరిస్థితి ఉంది.దీంతో కెసీఆర్ మార్క్ రాజకీయ వ్యూహాన్ని ప్రయోగిస్తూ పలు సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.
అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి రెండు దఫాలు అవుతున్నా ఉద్యమకారులకు తగిన న్యాయం జరగలేదనే విమర్శ కెసీఆర్ పై బలంగా ఉంది.
ఈ విమర్శ వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తే టీఆర్ఎస్ ఉనకికే పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడైన గద్దర్ కు రాజ్యసభ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే రానున్న రోజుల్లో ఉద్యమ కారులకు మరిన్ని అవకాశాలు కల్పించేలా ఇప్పటికే కెసీఆర్ ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలుస్తోంది.ఇంకా ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉండటంతో ఇక ప్రజల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకత రాకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో అటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ప్రతిపక్షాలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ముందుకెళ్లాలని కెసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ వార్తలపై టీఆర్ఎస్ నుండి అధికారికంగా ఎవరూ స్పందించకున్నా అయితే చివరి వరకు గోప్యంగా ఉంచే అవకాశం ఉంది.ఇదే కనుక నిజమైతే కెసీఆర్ అనుకూల వాతావరణం మరింత పెరిగే అవకాశం ఉంది.