టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.ఇటీవలే ఈ సినిమా నుంచి నవంబర్ 10న విడుదలైన నాటు నాటు సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది.ఈ పాట వ్యూయర్స్ సంఖ్య మూడు కోట్లకు చేరువయ్యింది.ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి వేసిన మాస్ స్టెప్పులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఈ వీడియోని స్పూఫ్ చేస్తూ చాలామంది సోషల్ మీడియాలో వీడియోలను పెడుతున్నారు.ఇటీవలే టీవీలో వస్తున్న పాటకు ఒక బామ్మ స్టెప్పులను ఇరగదీసిన విషయం తెలిసిందే.ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.ఇక ఈ పాటను తెరపై వీక్షించడానికి ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఈ పాటకు కీరవాణి స్వరాలు అందించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు.కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.
ఇదే వీడియోని స్ఫూర్తిగా తీసుకొని యువత కవర్ సాంగ్స్ తో, ఎడిటర్స్ తన అభిమాని కథానాయకుల పాత సాంగ్స్ తో రీ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నారు.ఈ క్రమంలోనే దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ డాన్స్ స్టెప్పులకు ఈ నాటు కన్నడ వెర్షన్ ను రూపొందించారు.ఈ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఈ వీడియోపై ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా స్పందించడం విశేషం.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ వుతోంది.