ఆచార్యకు గ్యాప్ ఇవ్వకుండా రాబోతున్న 'ఖిలాడీ'

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాను ఈ ఏడాది మే లోనే విడుదల చేయాల్సి ఉన్నా కూడా కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు.ఎట్టకేలకు సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

 Khiladi Movie Releasing One Week Gap After Acharya,latest Tollywood News-TeluguStop.com

డిసెంబర్‌ మరియు జనవరిలో పెద్ద ఎత్తున సినిమాలు విడుదల కాబోతున్నాయి.ఫిబ్రవరిలో సినిమాలు ఏమీ లేవనే ఉద్దేశ్యంతో కూల్‌ గా ఆ నెలలో వచ్చేలా ఆచార్య ప్లాన్‌ చేసుకున్నాడు.

కాని ఇప్పుడు ఆ నెలను కూడా హైజాక్ చేసేలా కొందరు హీరోలు ప్రయత్నాలు చేస్తున్నారు.మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య సినిమాకు పోటీగా అని కాదు కాని వరుసగా ఆ నెలలో సినిమాలు బాక్సాఫీస్ వద్దకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి.

ఆచార్య సినిమా విడుదల అయిన వారం రోజులకే రవితేజ నటించిన ఖిలాడీ సినిమాను కూడా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.

Telugu Acharay Khiladi, Chiranjeevi, Khiladi, Ravi Teja-Movie

రవితేజ ఖిలాడి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.రమేష్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో రవితేజ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు.ఖచ్చితంగా సినిమా మంచి వసూళ్లను దక్కించుకోవడం ఖాయం అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

భారీ ఎత్తున అంచనాలున్న ఖిలాడీ సినిమా ను ఆచార్య విడుదల అయిన వారం రోజులకే విడుదల చేయడం వల్ల ఖచ్చితంగా ప్రభావం రెండు సినిమాలపై ఉంటుందని అంటున్నారు.ఆచార్యకు కనీసం రెండు వారాల గ్యాప్ ఇచ్చి ఉంటే బాగుంటుంది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.

ఆచార్య సినిమా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందగా చరణ్ గెస్ట్‌ కు మించిన పాత్రలో కనిపించబోతున్నాడు.రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను దక్కించుకోవడంతో పాటు ఖచ్చితంగా మెగా అభిమానులు ఎప్పటికి గుర్తుంచుకునే సినిమాగా నిలుస్తుందని అంతా నమ్ముతున్నారు.

ఇలాంటి సినిమా వచ్చిన వారం రోజుల్లోనే ఖిలాడి రావడం మంచి పరిణామం కాదని అంటున్నారు.ఖిలాడి మాత్రమే కాకుండా మేజర్‌ సినిమా కూడా ఆచార్యకు ఒక్క వారం గ్యాప్ లోనే రాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube