నటుడు కోట శ్రీనివాసరావు విలన్ రోల్స్ మాత్రమే కాదు.సపోర్టింగ్ రోల్స్ ప్లే చేయడంలోనూ తనదైన శైలి నటన చూపి విలక్షణ నటుడిగా పేరు గాంచాడు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఉన్న ప్రస్తుతం కూడా పలు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు.
ఇకపోతే విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు విషయంలో జరిగిన విషాదం దాదాపుగా అందరికీ విదితమే.ఆయనకున్న ఏకైక కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు.2010 సంవత్సరంలో ఫాదర్స్ డే అనగా జూన్ 20న హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కోట తనయుడు మృతి చెందాడు.కోట శ్రీనివాసరావుకు ఒక్కడే కుమారుడు కాగా ఇద్దరు కూతుర్లు.నిజజీవితంలో తల్లి దండ్రులు అయిన కోట శ్రీనవాసరావు, ప్రసాద్.‘గాయం-2’ సినిమాలో అవే పాత్రలను పోషించారు.అయితే, ఆ సినిమాలో ప్రసాద్ పాత్ర మరణించగా, ఆసందర్భంలో భౌతిక కాయానికి తలకొరివి పెట్టే సీన్‌ను రీల్ లైఫ్‌లో చేయాల్సి వచ్చినపుడు కోట శ్రీనివాసరావు అందుకు నిరాకరించాడు.
దాంతో మూవీ మేకర్స్ ఆ సీన్‌ను కోట డూప్‌తో చేయించారు.
అలా కోట శ్రీనివాసరావు రీల్ లైఫ్ అనగా వెండితెరపైన సినిమాగా వచ్చే సీన్ కోసం తన తనయుడికి చితి పెట్టడానికి నిరాకరించాడు.
కానీ, రియల్ లైఫ్‌లో మాత్రం తప్పించుకోలేకపోయాడు కోట.నిజజీవితంలో తనయుడు ప్రసాద్‌కు తండ్రి కోట శ్రీనివాసరావు చితిపెట్టాల్సి వచ్చింది.ఇకపోతే ఈ విషాద ఘటన జరిగినపుడు కోట శ్రీనివాసరావు బెంగళూరులో ఉన్నారు.తన తనయుడు ఇక లేడన్న వార్త తెలియగానే హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు.ఆస్పత్రిలో కుమారుడి పార్థివ దేహాన్ని చూసి కుప్పకూలిపోయారు.
కోట కుమారుడి మరణ వార్త తెలుసుకుని సినీ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, నటీనటులు అందరు వచ్చి కోట శ్రీనివాసరావును పరామర్శించారు.చాలా చిత్రాల్లో కోటకు అసిస్టెంట్‌గా నటించిన కమెడియన్ బాబుమోహన్ కోటను ఓదారుస్తూనే ఆయన సైతం కన్నీటిపర్యంతమయ్యారు.
యాదృచ్ఛికంగా బాబుమోహన్ తనయుడు కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించాడు.