రామ్ గోపాల్వర్మ ఎలాంటి వాడంటే ఎక్కడ క్లోజ్ వేస్తే వీడు సినిమా అంతా గుర్తుంటాడు అనే విషయాలు తెలిసిన గొప్ప వ్యక్తి అని నటుడు తనికెళ్ల భరణి తాను చేసిన శివ సినిమాను మరోసారి గుర్తు చేసుకున్నారు.ఒక రౌడీ తలుపు తీసుకొని వచ్చి, ఏంటీ పర్మిషన్ లేకుండా వచ్చావు అని అవతల వ్యక్తి అనగానే, అతను మళ్లీ వెనక్కి వెళ్లి “రావచ్చా” అని అంటాడని, నిజానికి రావచ్చా అనే పదంలో గొప్పతనం ఏమీ లేదు.
కానీ ఆ చూపించే విధానం, ఆ క్లోజింగ్ ఆయనొక్కడికే సాధ్యం అని తనికెళ్ల భరణి చెప్పారు.
అంతేకాకుండా 24 క్రాఫ్ట్స్ కలిస్తే సినిమా అన్న ఆయన, అదే రచన అయితే ఒక్కరే రాసి, ఒక్కరితో అయినా కూడా నడుస్తుంది.
కానీ సినిమాకు వచ్చేసరికి ఏ హీరో సక్సెస్ అయినా, ఏ డైరెక్టర్ సక్సెక్ అయినా ఇంతమంది కూడా దానికి కారణమేనని ఆయన వివరించారు.ఆర్జీవి దర్శకత్వంలో తెరకెక్కిన శివ సినిమా తన వల్ల ఆడిందనుకున్నా, ఇంకెవరనుకున్నా కూడా అది కేవలం అజ్ఞానమే తప్ప ఇంకేం లేదని ఆయన చెప్పారు.
ఇకపోతే తనకు రాజకీయ నాయకుల్లో ఎవరు ఇష్టమన్న దానిపై ఆయన పెదవి విప్పారు.చిన్నపుడు నెహ్రూ, ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ఇలా మారుతూ ఉండేవన్న ఆయన అలా ఎప్పటికప్పుడు పరిణామ క్రమం మారుతూ ఉండొచ్చని తనికెళ్ల భరణి అన్నారు.అది అప్పుడు వాళ్లు చేసే పనిమీద ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.