సూపర్‌ స్టార్‌ 'పెద్దన్న'కు పెట్టింది ఎంత? వచ్చేది ఎంత?

కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ తాజాగా దీపావళి సందర్బంగా అన్నాత్తే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా విడుదల కు ముందు భారీ అంచనాలను కలిగి ఉండటం వల్ల తమిళనాట భారీ వసూళ్లను దక్కించుకుంది.

 Rajinikanth Annathe Telugu Movie Peddanna Collections,latest News-TeluguStop.com

మొదటి రెండు రోజుల్లో భారీ ఎత్తున వసూళ్లు నమోదు అయిన నేపథ్యంలో అక్కడ కాస్త పర్వాలేదు అన్నట్లుగా పరువు నిలుపుకుంది.కాని తెలుగు లో మాత్రం అన్నాత్తే అదే పెద్దన్న మరీ దారుణమైన ఫలితాన్ని చవి చూస్తుందని అంటున్నారు.

తెలుగు లో పెద్దన్న గా విడుదల అయిన ఈ సినిమా కు వచ్చిన వసూళ్లు చూస్తుంటే బయ్యర్లు గుండెలు బాదుకుంటున్నట్లుగా చెబుతున్నారు.మరీ దారుణమైన కలెక్షన్స్ ను మేము ఊహించలేదు అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం రజినీకాంత్ రేంజ్‌ తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంది అనేది చెప్పకనే చెబుతోంది.

Telugu Annathe, Peddanna, Rajinikanth-Movie

అన్నాత్తే సినిమాకు ఉన్న బజ్‌ నేపథ్యంలో పెద్దన్న సినిమాను తెలుగు డబ్బింగ్‌ రైట్స్ కు గాను 15 కోట్ల రూపాయలను ప్రముఖ నిర్మాత ఖర్చు పెట్టాడు.తెలుగు లో రజినీకాంత్‌ సినిమా సక్సెస్ అయితే పాతిక కోట్లు ఈజీగా వస్తుందని ఆయన ఆశించాడు.కాని సినిమా సక్సెస్ కాలేదు.దాంతో రజినీకాంత్‌ ఈమద్య కాలంలో డౌన్ ఫాల్‌ లో ఉన్న కారణంగా ఆయన సినిమా వసూళ్లు మరీ దారుణంగా ఉన్నాయి.16 కోట్ల బ్రేక్‌ ఈవెన్ కు గాను తెలుగు రాష్ట్రాల్లో అన్నాత్తే అదే పెద్దన్న సినిమా కనీసం రెండున్నర నుండి మూడు కోట్ల వసూళ్లు కూడా దక్కించుకోలేక పోతుంది అంటూ ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.దీపావళికి విడుదల అయిన మరో సినిమా కూడా గొప్పగా ఏమీ లేదు.అయినా కూడా పెద్దన్న సినిమాకు వసూళ్లు ఏమీ కనిపించడం లేదు.ఈ సమయంలో సినిమా కు థియేటర్‌ కు వెళ్లాలి అంటే ఖచ్చితంగా సూపర్ హిట్ టాక్ ను దక్కించుకోవాలి.కాని పెద్దన్నకు అంత సీన్ లేక పోవడంతో జనాలు పట్టించుకోవడం లేదు.

వసూళ్లు అందుకే దారుణంగా ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube